వాణీ విశ్వనాథ్ ఈ తరం జనరేషన్ ప్రేక్షకులకు పెద్దగా గుర్తు ఉండకపోవచ్చేమో గాని… 1980-90వ దశకంలో ఆమె ఓ హాట్ హీరోయిన్. హాట్ సీన్లలో వాణీ ఉందంటే చాలు కుర్రకారు నుంచి నడివయస్సు ప్రేక్షకుల వరకు థియేటర్లకు క్యూ కట్టేవారు. చిరంజీవి – కె. రాఘవేంద్రరావు కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ఘరానా మొగుడు సినిమాలో ఆమె రెండో హీరోయిన్‌గా నటించింది. ఆ సినిమాలో ఆమె వాన పాటలో తన వయ్యారాలు ఒలకబోస్తూ కిటుకులు తెలిసిన చిటపట చినుకులు పాటలో ఆమె హోయలు ఒలికించిన తీరు ఇప్పటకీ తెలుగు ప్రేక్షకులు మరచిపోలేరు.
ఇక ఆమె ఇటీవల జయజానకీ నాయక సినిమాలో కూడా జగపతిబాబు చెల్లిగా నటించింది. ఇక మళయాళీ అయిన వాణీ ఆ సినిమా ఇండస్ట్రీకే చెందిన బాబూ రాజ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం ఆమె చెన్నైలో నివాసం ఉంటోంది. ఇక గతేడాది ఎన్నికలకు ముందు ఆమె టీడీపీలో చేరారు. నగరి నుంచి రోజాపై ఆమె టీడీపీ తరపున పోటీ చేస్తారన్న వార్తలు కూడా వచ్చాయి.
అయితే ఆ తర్వాత ఆమె సైలెంట్ అయ్యారు. ఇక తెలుగులో ఆమె సెకండ్ ఇన్సింగ్స్ ప్రారంభించినా అనుకున్న స్థాయిలో అవకాశాలు రాలేదు. ఆమె సౌత్‌లో దశాబ్దానికి పైగా నటించి 120 సినిమాలు చేశారు.