టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 2000లో వచ్చిన బద్రి సినిమాతో డైరెక్టర్‌గా పరిచయం అయిన పూరి ఇప్పుడు తిరుగులేకుండా దూసుకుపోతున్నాడు. ఎన్ని ప్లాపులు వచ్చి కింద పడినా ఒక్క హిట్‌తో తానేంటో ఫ్రూవ్ చేసుకోవడమే పూరి ప్రత్యేకత. ఆరు వరుస ప్లాపులు వచ్చినా కూడా పూరి ఇస్మార్ట్ శంకర్‌తో హిట్ కొట్టి సత్తా చాటాడు. ఇదిలా ఉంటే పూరి డైరెక్టర్ అవ్వడానికి ముందే దూరదర్శన్ సీరియల్స్ చేసేటప్పుడే 1996 సెప్టెంబర్ 4న లావణ్యను వివాహం చేసుకున్నాడు.
పూరి దూరదర్శన్ సీరియల్ షూటింగ్ చేస్తున్నప్పుడు ఆ షూటింగ్ చూసేందుకు వచ్చిన అమ్మాయిల్లో లావణ్య ఒకరు. ఆమెను తొలి చూపులో చూడడంతోనే ప్రేమలో పడిపోయిన పూరి విజిటింగ్ కార్డు ఇచ్చి నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటే అందులో ఉన్న ఫోన్ నెంబర్‌కు ఫోన్ చేయమమని చెప్పి వచ్చేశాడు. ఆ విజిటింగ్ కార్డు ఇచ్చిన వారం రోజులకు లావణ్య పూరికి ఫోన్ చేసి పెళ్లి చేసుకుంటానని చెప్పింది. తర్వాత వారి పెళ్లి జరిగింది.
ఇక ఈ దంపతులకు ఆకాశ్, పవిత్ర అనే పిల్లలు ఉన్నారు. ఆకాశ్ ఇప్పటికే హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక పూరి సినిమాల్లో ప్రేమకథల్లో ఎలాంటి ట్విస్టులు ఉంటాయో ? పూరి ప్రేమకథ కూడా అంతే కొత్తగా ఉన్నట్టు ఉంది కదూ..! ఇక ఈ దంపతుల పెళ్లికి సీనియర్ యాంకర్ ఝాన్సీ చాలా సాయం చేసిందట.