టాలీవుడ్‌లో బలమైన కుటుంబాలలో ఒకటి అయిన దగ్గుబాటి కుటుంబంకు ఐదు దశాబ్దాలకు పైబడి చరిత్ర ఉంది. ఎక్కడో ప్రకాశం జిల్లాలోని కారంచేడు నుంచి చెన్నై వెళ్లిన రామానాయుడు భారతేదశంలోని అన్ని భాషల్లోనూ సినిమాలు తీసిన నిర్మాతగా రికార్డులకు ఎక్కి మూవీ మొఘల్ అయ్యారు. ఆయన వారసుల్లో సురేష్‌బాబు నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్‌గా, ఎగ్జిబిటర్‌గా ఉన్నారు. ఆయన రెండో తనయుడు విక్టరీ వెంకటేష్ టాలీవుడ్ టాప్ హీరోగా మూడున్నర దశాబ్దాలకు పైగా కొనసాగుతున్నారు.
ఇక వెంకటేష్ ఆస్తుల విషయానికి వస్తే తండ్రి రామానాయుడు నుంచే వారసత్వంగా కోట్లాది రూపాయలు సొంతం అయ్యాయి. ఫారిన్‌లో చదువుకున్న వెంకీ కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన కలియుగ పాండవులు సినిమాతో వెండి తెరంగ్రేటం చేశాడు. వెంకీకి తండ్రి నుంచి వచ్చిన ఆస్తులు, తాను సినిమాల్లో హీరోగా చేయడం ద్వారా వచ్చిన ఆస్తులతో పాటు చిన్న చిన్న బిజినెస్‌ల ద్వారా వచ్చిన ఆస్తుల విలువ రు. 2100 కోట్ల పై మాటే అని లెక్కలు వేశారు.
అయితే తండ్రి నుంచి వచ్చి చరాస్తుల విలువ లెక్క మాత్రం ఊహకు అందని విధంగానే ఉంటుందని… వాటి విలువ లెక్కించలేం అని ఇండస్ట్రీ వర్గాలు చెపుతున్నాయి. రామనాయుడు సంపాదనలో చాలా ఆస్తులు చెన్నలోనూ, హైదరాబాద్‌లోనూ ఉన్నాయి. వీటి విలువ ఇప్పుడు కోట్లలోనే ఉంటుందట.