తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ పేషీలో కరోనా కలకలం రేపింది. ఒకరు కాదు ఇద్దరు కాదు మొత్తం ఏడుగురికి కోవిడ్ పాజిటివ్ వచ్చింది. ఈ ఏడుగురిలో ఇద్దరు డ్రైవర్లతో పాటు మరో ఇద్దరు పీఏలు, ముగ్గురు గన్‌మెన్లు ఉన్నారు. టోటల్‌గా పేషీ మొత్తానికి కోవిడ్ రావడంతో ఇప్పుడు మంత్రి అనుచరుల్లో తీవ్ర ఆందోళన ప్రారంభమైంది. మిగిలిన వారితో పాటు మంత్రి అనుచరులు అందరూ కోవిడ్ టెస్టులు చేయించుకుంటున్నారు.
ఇక మంత్రి ఈటల మాట్లాడుతూ ప్రతి రెండు వారాలకు తన సిబ్బందికి తప్పనిసరిగా కోవిడ్ టెస్టులు చేయిస్తున్నానని తెలిపారు. ఇక బీఆర్కే భవన్‌లో కూడా ఒక్క రోజే 13 మందికి కరోనా రావడంతో ఆ భవనం అంతా పూర్తిగా శానిటైజ్ చేశారు. ఇక గురువారం చేయించుకున్న పరీక్షలో తనకు నెగిటివ్ వచ్చిందని మంత్రి చెప్పారు.