మనదేశంలో రోజు రోజుకు కరోనా కేసులు వేలల్లోనే నమోదు అవుతున్నాయి. ఈ క్రమంలోనే కొద్ది రోజులుగా మన దేశంలో కేసులు చూస్తుంటే భారత్ కేసుల్లో బ్రెజిల్‌ను దాటేస్తుందని అందరూ అంచనా వేశారు. ఇప్పుడు అదే నిజం అయ్యింది. కరోనా కేసుల సంఖ్యలో భారత్ బ్రెజిల్‌ను దాటేసి రెండో స్థానానికి ఎగబాకింది. ఇక గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 90, 802 కొత్త కేసులు నమోదు అవ్వగా మొత్తం కేసులు 42 వేలు దాటేశాయి.
ఇక ఇప్పటి వరకు 64,60,250 కేసులతో అమెరికా అగ్రస్థానంలో ఉండగా.. 42,04,614 కేసులతో భారత్ రెండో స్థానంలో, 41,37,606 కేసులతో బ్రెజిల్ మూడో స్థానంలో కొనసాగుతోంది. ఇక గత 24 గంటల్లో 1016 మంది మృతి చెందగా… మొత్తం మృతుల సంఖ్య 71,642 కు చేరింది. ఇక ఇప్పటి వరకు మనదేశంలో ఇప్పటివరకు 32,50,429 మంది వైరస్ బాధితులు కోలుకున్నారు. ఇక దేశంలో కరోనా రోగుల రికవరీ రేటు 77.30 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.70 శాతంగా ఉంది.