Politicsఆ నొప్పి కూడా కరోనా కొత్త ల‌క్ష‌ణ‌మే... వామ్మో ఇదేం ఇలా...

ఆ నొప్పి కూడా కరోనా కొత్త ల‌క్ష‌ణ‌మే… వామ్మో ఇదేం ఇలా కూడానా..!

ప్ర‌పంచ మ‌హ‌మ్మారి క‌రోనా వైర‌స్ రోజుకో కొత్త ల‌క్ష‌ణాన్ని సంత‌రించుకుంటోంది. ఇప్ప‌టికే క‌రోనాకు సంబంధించి అనేక ల‌క్ష‌ణాలు బ‌య‌ట‌ప‌డుతున్నాయి. ఇప్ప‌ట‌కి స‌రైన వ్యాక్సిన్ లేక పోవ‌డంతో క‌రోనా కోర‌లు చాస్తూనే ఉంది. ప‌లువురు ప్ర‌ముఖులు సైతం క‌రోనా భారీన ప‌డి మృతి చెందుతున్నారు. ఇదిలా ఉంటే క‌రోనా వైర‌స్ కొత్త ల‌క్ష‌ణం ఒక‌టి బ‌య‌ట ప‌డింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న ల‌క్ష‌ణాల్లో జ‌లుబు, ద‌గ్గు, ఊపిరి తీసుకునేందుకు ఇబ్బంది ప‌డ‌డం లాంటివి క‌రోనా ల‌క్ష‌ణాలుగా ఉన్నాయి.

Heart disease: Types, causes, and treatments

ఇక వీటికి తోడు జ్వ‌రం, రుచి తెలియ‌క‌పోవ‌డం, వాస‌న గుర్తించ‌లేక‌పోవ‌డం, త‌ల‌నొప్పి లాంటివి కూడా క‌రోనా ల‌క్ష‌ణాలే అని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ ఇది వ‌ర‌కే వెల్ల‌డించింది. అయితే ఈ ల‌క్ష‌ణాల‌తో పాటు ఛాతీలో నొప్పి కూడా క‌రోన కొత్త ల‌క్ష‌ణ‌మే అని తేలింది. క‌రోనా వ‌ల్ల శ్వాస తీసుకోవ‌డం క‌ష్టం అవుతుంది కాబ‌ట్టి… అందువ‌ల్లే ఛాతిలో నొప్పి వ‌స్తుంద‌ని మ‌రి కొంద‌రు చెపుతున్నారు. అయితే ఇది అంత ప్ర‌భావం చూపే ల‌క్ష‌ణం కాద‌ని.. దీని గురించి భ‌య‌ప‌డాల్సిన ప‌నిలేద‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ చెపుతోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news