ప్రపంచ మహమ్మారి కోవిడ్ -19 వ్యాక్సిన్ కోవాక్సిన్ క్లీనికల్ ట్రయల్స్‌లో జంతువులపై అదిరిపోయే ఫలితాలు ఇచ్చినట్టు టీకా తయారీ సంస్థ భారత్ బయోటెక్ శుక్రవారం ప్రకటించింది. ఈ వ్యాక్సిన్ ఇచ్చిన జంతువుల్లో రోగ నిరోధక శక్తి బాగా అభివృద్ధి చెందినట్టు తెలిసింది. వ్యాక్సిన్ ఇచ్చిన జంతువుల్లో ఎలాంటి ప్రతికూల ఫలితాలు కూడా రాకపోవడంతో రెండో డోస్ కూడా ఇచ్చారు. రెండో డోస్ ఇచ్చాక మరోసారి పరిశోధించగా ముక్కు, గొంతు, ఊపిరితిత్తుల్లో వైరస్ వృద్ధి గణనీయంగా తగ్గిందట.
ఇరవై కోతులను మొత్తం నాలుగు టీంలుగా విభజించి ఈ ప్రయోగాలు చేశారు. ఓ సమూహంలో కోతులకు ప్లేసిబో ఇవ్వగా.. మూడు గ్రూపులకు 14 రోజుల పాటు మూడు వేర్వేరు వ్యాక్సిన్ ఇవ్వడంతో రోగనిరోధశక్తి పెరిగింది. ఇక రెండో డోసు ఇచ్చిన 14 రోజుల తర్వాత అన్ని కోతుల్లోనూ సార్స్‌కోవ్-2ను ప్రవేశపెట్టారు. ఆ తర్వాత డోసు పెంచారు. ఇక మూడో వారంలో పోస్ట్ ఇమ్యునైజేషన్ విధానం ద్వారా యాంటీబాడీలు తటస్థం అయ్యాయి.
ఇక తొలి దశలో ట్రయల్స్ సక్సెస్ కావడంతో భారత్ బయోటెక్ సంస్థ రెండో దశ ట్రయల్స్‌కు కూడా దిగింది. జంతువులపై టీకా సత్ఫలితాలను నిస్తుండటంతో ఆ సంస్థ ఆనందం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే కొన్ని దేశాలు ఈ ప్రయోగ ఫలితం తెలుసుకునేందుకు ఆసక్తి చూపడంతో ప్రపంచంలో వ్యాక్సిన్ కోసం వెయిటింగ్‌లో ఉన్న చాలా దేశాలు దీనిని ఆర్డర్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.