ఓ యువతి కరోనా పాజిటివ్‌తో బాధపడుతున్నా కూడా ఆ కామాంధుడు ఆమెను వదల్లేదు. కేరళలో జరిగిన ఈ దారుణ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. కేరళలలో ఓ వృద్ధురాలిని, ఓ యువతిని హాస్పటల్‌కు తరలించేందుకు ప్రభుత్వం ఓ అంబులెన్స్ పంపింది. పెద్దావిడను హాస్పటల్లో దింపిన ఆ డ్రైవర్ బయట ఉన్న యువతిని మీకు వేరే హస్పటల్ కేటాయించారని నమ్మించాడు. దీంతో ఆ యువతిని అంబులెన్స్‌లో ఎక్కించుకుని ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకు వెళ్లాడు.
అక్కడకు తరలించి ఆమెపై రేప్ చేసేందుకు ప్రయత్నించాడు. ఆమె తనకు కరోనా ఉందని చెప్పినా కూడా ఆ కామాంధుడు వదల్లేదు. అక్కడ అంబులెన్సులోనే రేప్ చేశాడు. ఆమెకు కరోనా ఉందన్న భయం ఏ మాత్రం లేకుండా ఆమెపై ఘోరంగా రేప్ చేశాడు. అనంతరం ఆమెను బెదిరించి ఆసుపత్రిలో దించేశాడు. ఈ విషయాన్ని బాధితురాలు డాక్టర్లకు చెప్పుకుని భోరున విలపించింది.
వైద్యులు ఆమెకు పరీక్షలు చేయగా ఆమె చెప్పింది నిజమే అని తేలింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. అయితే కరోనా రోగిని రేప్ చేయడంతో ముందుగా అతడిని క్వారంటైన్‌కు తరలించారు.. ఆ తర్వాత అతడికి రిమాండ్ విధిస్తామన్నారు.