స్టైలీష్‌స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం టాలీవుడ్లో తిరుగులేని టాప్ హీరోగా దూసుకు పోతున్నాడు. ఇంకా చెప్పాలంటే అల వైకుంఠపురంలో సినిమా తర్వాత యంగ్ హీరోలలో బన్నీయే నెంబర్ వన్ పొజిషన్లో ఉన్నాడని చెప్పక తప్పదు. గంగోత్రి సినిమాతో హీరోగా పరిచయం అయిన బన్నీ స్నేహా రెడ్డిని ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. బన్నీకి మామ తరపు నుంచి రు. 300 కోట్లు కట్నం వచ్చిందట. ఇందులో స్థిరాస్థులతో పాటు చరాస్తులు కూడా ఉన్నాయట.
ముందుగా బన్నీ తన ప్రేమను తన తల్లికి చెప్పగా ఆ తర్వాత మిగిలిన కుటుంబ సభ్యులు ఒప్పుకున్నారట. బన్నీ ప్రేమ పెళ్లిగా మారడంలో బన్నీ తల్లిదే కీలక పాత్ర అట. ఇక బన్నీ మామ చంద్రశేఖర్ రెడ్డి టీఆర్ఎస్ లీడర్. తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఆయన అత్యంత సన్నిహితుడు. కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి విద్యాసంస్థల అధినేత.
వీళ్లకు చాలా కాలేజ్‌లు ఉన్నాయి. బన్నీ ఆ కాలేజ్‌లకు డైరెక్టర్. ఆ సమయంలోనే ఆమె బన్నీతో ప్రేమలో పడింది. ఇక 2011లో వీరి పెళ్లి జరిగింది. ఇక కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి 2014లో ఇబ్రహీంపట్నంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు.