ప్రస్తుతం సౌత్ సినిమా ఇండస్ట్రీలోనే మ్యూజిక్ డైరెక్టర్ థమన్ పిచ్చ ఫంలో ఉన్నాడు. అల సాంగ్స్ తర్వాత థమన్ పేరు ఇక్కడ మార్మోగిపోతోంది. ముఖ్యంగా చాలా స్పీడ్‌గా సాంగ్స్ చేస్తాడని థమన్‌కు పేరుంది. అందుకే ఎక్కువ మంది థమన్‌నే మ్యూజిక్ డైరెక్టర్‌గా పెట్టుకుంటున్నారు. పవన్ వకీల్‌సాబ్, సాయిధరమ్ సోలో బ్రతుకే సో బెటర్, రవితేజ క్రాక్, కీర్తిసురేష్ మిస్ ఇండియా సినిమాలన్నీ థమనే చేస్తున్నాడు. ఇవే కాదు బాలయ్య – బోయపాటి బీబీ 3, నాని టక్ జగదీశ్, వరుణ్ తేజ్ స్పోర్ట్స్ డ్రామా, మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాలు కూడా లైన్లో ఉన్నాయి.
ఇదిలా ఉంటే థమన్ పెద్ద కాపీ క్యాట్ అని.. ఒక్కోసారి తన సంగీతం తానే కాపీ కొడతాడని… మరికొన్ని సార్లు ఇతర మ్యూజిక్ డైరెక్టర్లు ఇచ్చిన టాప్ బిట్స్‌ను కూడా అలాగే ఎత్తేస్తాడన్న విమర్శలు ఉన్నాయి. తాజాగా నాని నటించిన వి సినిమా ఓటీటీలో రిలీజ్ అయ్యింది. ఈ సినిమాతో థమన్ మరోసారి కాపీ క్యాట్ అన్న సెటైర్లు పడుతున్నాయి. ఈ సినిమాకు బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది మ్యూజిక్ ఇవ్వగా ఆర్ ఆర్ మాత్రం థమన్ ఇచ్చాడు. ఈ వీ ఆర్ కోలీవుడ్‌లో వచ్చిన రాచ్చసన్ (తెలుగు రాక్షసుడు) ని పోలి ఉందని ఒరిజనల్‌తో కంపేరిజన్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు.
అలాగే గేమ్ ఆఫ్ థ్రోన్స్ 6వ సీజన్ 10వ ఎపిసోడ్ లోని వైల్డ్ ఫేర్ టైంలో వచ్చే ఆర్ ఆర్‌ను కూడా థమన్ దొంగిలించేశాడని.. ఇక క్లైమాక్స్ ఫైట్‌కు ముందు వచ్చే సీన్లకు తమిళ అసురన్ ఆర్ ఆర్ వాడేశారని ట్రోల్ చేస్తున్నారు. దీనికి కింగ్ సినిమాలో నాగార్జున బ్రహ్మీని పక్కోడి ట్యూన్స్ దొబ్బేసి మ్యూజిక్ ఇస్తావా ? అని ఆడుకునే ఫొటోలను జతచేసి మరీ ఆడుకుంటున్నారు.