మూడు పెళ్లిళ్లు చేసుకున్న హీరోయిన్ వనిత విజయ్‌కుమార్ ఇటీవల దక్షిణాది మీడియాలో బాగా కాంట్రవర్సీ అవుతున్నారు. ఇప్పటికే ఇద్దరిని పెళ్లి చేసుకుని విడాకులు ఇచ్చిన ఆమె ఇటీవలే పీటర్ పాల్ అనే వ్యక్తిని మూడో వివాహం చేసుకుని పెద్ద వివాదానికి తెరలేపింది. నటి కస్తూరి, దర్శకురాలు లక్ష్మీ రామకృష్ణన్ వనిత మూడో పెళ్లి చేసుకోవడంపై విమర్శల దాడి చేశారు. వనిత కూడా తానేమి తక్కువ తినలేదని రివర్స్ ఎటాక్ చేసింది.
ఈ వ్యవహారం చివరకు కోర్టుల వరకు వెళ్లింది. ఇలా పెళ్లి చేసుకున్న కొద్ది రోజులకే వనిత భర్త పీటర్ పాల్ గుండెపోటుకు గురై చికిత్స అనంతరం ఆయన ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. తాజాగా వనిత, పీటర్ పాల్ కరెన్సీ మాలను మెడలో ధరించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ ఫోటోలను వనిత స్వయంగా తన ఇన్‌స్టా గ్రామ్ అక్కౌంట్లలో పోస్ట్ చేశారు. తన ఇంట్లో లక్ష్మీ కుబేర పూజను నిర్వహించినట్లు పేర్కొంది. 2020లో అందరికి మంచి జరగాలని తాను కోరుకుంటున్నట్టు వనిత చెప్పారు. ఈ ఫొటోలు చూసిన వారు వామ్మో వనిత ఎలా అయినా కాంట్రవర్సీ క్రియేట్ చేయడంలో తనకు తానే సాటి అని కామెంట్లు పెడుతున్నారు.