Sportsబ్రేకింగ్‌: షాకింగ్ డెసిష‌న్‌తో ప్ర‌పంచ ఫుట్‌బాల్ అభిమానుల‌కు షాక్ ఇచ్చిన...

బ్రేకింగ్‌: షాకింగ్ డెసిష‌న్‌తో ప్ర‌పంచ ఫుట్‌బాల్ అభిమానుల‌కు షాక్ ఇచ్చిన మెస్సీ

అర్జెంటీనా స్టార్ ప్లేయర్ లియోనల్ మెస్సీ సంచ‌ల‌న నిర్ణ‌యంతో ప్ర‌పంచ ఫుట్‌బాల్ అభిమానుల‌కు దిమ్మ‌తిరిగిపోయే షాక్ ఇచ్చారు. రెండు ద‌శాబ్దాల పాటు బార్సిలోనా క్ల‌బ్‌కు ప్రాథినిత్యం వ‌హించిన ఈ ఫుట్‌బాల్ దిగ్గ‌జం ఆ జ‌ట్టును వీడుతున్న‌ట్టు అధికారికంగా ప్ర‌క‌టించాడు. ఇదే విష‌యాన్ని జ‌ట్టు మేనేజ్‌మెంట్ కూడా అధికారికంగా ప్ర‌క‌టించింది. మెస్సీ త‌న నిర్ణ‌యాన్ఇన బ్యూరోఫాక్స్ ద్వారా చెప్పాడ‌ని కూడా బార్సీలోనా మేనేజ్‌మెంట్ తెలియ‌జేసింది.

ఇక మెస్సీ ఇంత స‌డెన్‌గా బార్సాలోనా  క్ల‌బ్ నుంచి వైదొల‌గ‌డానికి ప్ర‌ధాన కార‌ణం 11 రోజుల క్రితం చాంపియన్స్‌లీగ్‌లో ఎదురైన ఘోరపరాజయమే కార‌ణ‌మంటున్నారు. ఈ ప‌రాజ‌యంతో కుంగిపోయిన మెస్సీ ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలుస్తోంది. లీగ్ క్వార్టర్ ఫైనల్లో మెస్సీ నేతృత్వంలోని బార్సీలోనా జట్టు 2-8తో బేర్న్ మునిచ్ చేతిలో చిత్తుగా ఓడింది. ఈ ప‌రాజ‌యాన్ని మెస్సీ కెరీర్‌లోనే ఘోర‌మైన ప‌రాజ‌యంగా చెపుతున్నారు. ఇదిలా ఉంటే 2007-08 సీజ‌న్ నుంచి టైటిల్స్ గెలుస్తోన్న ఆ జ‌ట్టుకు ఇది నిజంగానే ఘోర ప‌రాజ‌యం కిందే లెక్క‌.

మెస్సీ 2003లో 16 ఏళ్ల వయసులో క్లబ్ తరఫున అరంగేట్రం చేశాడు. అప్పటి నుంచి బార్సిలోనాకు మొత్తం 34 టైటిళ్లు అందించాడు. లియోనల్‌ మెస్సీ.. క్లబ్‌లోనే అత్యధిక వ్యక్తిగత రికార్డు ఉన్న ఆటగాడు. క్లబ్ తరపున 731 మ్యాచ్‌లు ఆడి 634 గోల్స్ చేశాడు. ఏదేమైనా మెస్సీ నిర్ణ‌యం ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న ఫుట్‌బాల్ అభిమానుల‌కు పెద్ద షాక్ లాంటిదే.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news