అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ప్రధాని మోదీ ఆధ్వర్యంలో అట్టహాసంగా భూమి పూజ జరుగుతోంది. అయితే అసలు అయోధ్య వివాదం పూర్వాపరాలు పరిశీలిస్తే 28 ఏళ్ల క్రితం.. 1992 డిసెంబరు ఆరున ఏం జరిగింది ? అన్నదానిపై నాడు ప్రత్యక్షసాక్షిగా ఉన్న ఓ ప్రముఖ జర్నలిస్టు నేడు అక్షర రూపంలో ప్రపంచానికి తెలియజేశారు. ఆ రోజు బాబ్రీ మసీదు గేట్లకు ముందు స్థలంలో హోమానికి ఏర్పాట్లు ప్రారంభమయ్యాయట. తాము కట్టబోయే నిర్మాణానికి భూమిపూజ మరికొద్ది సేపట్లో ప్రారంభమవుతుందని ఆర్ఎస్ఎస్ ప్రముఖుడు ఒకరు చెప్పారు. ఈ లోగా ఫైజాబాద్ జిల్లా మెజిస్ట్రేట్‌గా ఉన్న ఆర్.ఎస్. శ్రీవాత్సవ అక్కడకు చేరుకుని జిల్లా ఎస్పీతో మాట్లాడి వెళ్లిపోయారు. తర్వాత ఇదే శ్రీవాత్సవ బీజేపీ ఎంపీ అయ్యారు.
ఇక ఆ తర్వాత బీజేపీ అగ్రనేతలు ఆద్వానీ, మురళీ మనోహర్ జోషీ ఉమాభారతి ప్రమోద్ మహాజన్, కేదార్ నాథ్ సహానీ, విజయరాజే సింధియా మొదలైన అగ్రనేతలంతా అక్కడకు వచ్చారు. సరిగ్గా 10.30 గంటలకు కార్యక్రమం ప్రారంభంకాగా… వేలాది మంది కరసేవకులు బాబ్రీ మసీదు వద్దకు దూసుకువచ్చి దానిని పూర్తిగా నేలమట్టం చేశారు. సరిగ్గా ఇప్పుడు 28 సంవత్సరాల తర్వాత అక్కడ ఇదే ప్రాంతంలో మసీదు నిర్మాస్తారని తాము ఊహించలేకపోయామని ఆ జర్నలిస్టు పేర్కొన్నారు.