బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ అందాదున్ తెలుగు రీమేక్ వెర్షన్లో నితిన్ నటిస్తోన్న విషయం తెలిసిందే. ఇక హిందీలో టబు చేసిన పాత్రకు తెలుగులో ఎవరిని ఎంపిక చేయాలా ? అని కొద్ది రోజులుగా చర్చలు నడుస్తున్నాయి. తెలుగులో కూడ టబు రేంజ్లో ధీటుగా నటిస్తుందా ? లేదా ? అన్నదే సందేహంగా మారింది. వాస్తవానికి హిందీలో చేసిన టబునూ తెలుగులో కూడా నటింపజేయాలని అనుకున్నారు. అయితే ఆమె భారీగా రెమ్యునరేషన్ డిమాండ్ చేయడంతో ఇప్పుడు మేకర్స్ లేడీ సూపర్‌స్టార్ నయనతార వైపు మొగ్గుచూపారు.
నయనతార కూడా రు. 3 కోట్ల వరకు డిమాండ్ చేసిందట. దీంతో అంత ఇచ్చుకోలేమని వీరు డిసైడ్ అవ్వడంతో ఇప్పుడు ఈ ఛాన్స్ మరో సీనియర్ నటి శ్రీయకు దక్కిందంటున్నారు. పెళ్లి అయినా కూడా శ్రీయా శరణ్ తెలుగులో మంచి ఆపర్లే అందుకుంటోంది. ఇప్పుడు లేటెస్ట్గా ఆమెకు అందాదున్ ఆఫర్ ఆమెకు చిక్కిందంటున్నారు. పెళ్లి అయినా కూడా శ్రియా ఎక్కడా తగ్గడం లేదు. ఇప్పుడు ఈ బోల్డ్ ఎటెంప్ట్తో అయినా ఆమె కెరీర్ టర్న్ అవుతుందేమో ? చూడాలి.
ఏదేమైనా శ్రీయ ఈ రోల్ చేసినా టబు రేంజ్ అంత బోల్డ్నెస్ చూపిస్తుందా ? అన్నదే కాస్త సస్పెన్స్. తెలుగులో శ్రియకు ఉన్న ఇమేజ్‌కు ఆమె కొద్దిపాటి గ్లామర్ టచ్ ఇచ్చినా అదిరిపోయినట్టే..? నితిన్ ప్రస్తుతం చేస్తోన్న రంగ్ దే రిలీజ్ కాగానే అందాదున్ తెలుగు రీమేక్ సెట్స్ మీదకు వెళ్తుంది. మేర్లపాక గాంధి తెలుగు అందాదున్ ను డైరెక్ట్ చేస్తున్నారు.