Moviesఈ హీరోయిన్లు పెళ్లి చేసుకోక‌పోవ‌డానికి కార‌ణాలు ఇవే...!

ఈ హీరోయిన్లు పెళ్లి చేసుకోక‌పోవ‌డానికి కార‌ణాలు ఇవే…!

ఇండ‌స్ట్రీలో హీరోయిన్లు చాలా లేట్‌గా పెళ్లి చేసుకుంటారు. కెరీర్ చివ‌రి ద‌శ‌లో కూడా మంచి అవ‌కాశాలు వ‌స్తే త్వ‌ర‌గా పెళ్లి చేసుకునేందుకు అంత‌గా ఆస‌క్తి చూప‌రు. న‌య‌న‌తార‌, అనుష్క‌, అంజ‌లి, త్రిష ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది హీరోయిన్లు మూడున్న‌ర ప‌దుల వ‌య‌స్సుకు చేరువ అవుతున్నా ఇంకా పెళ్లి ఊసే లేకుండా సినిమా ఛాన్సుల కోసం వెయిటింగ్‌లో ఉన్నారు. అస‌లు కొంత‌మంది హీరోయిన్లు పెళ్లికే దూరంగా ఉన్నారు.

Shobana - Classical Dancer - Chennaiyil Thiruvaiyaru

వీరిలో కొంద‌రు హీరోయిన్లు ఉంటే, మ‌రి కొంద‌రు న‌టీమ‌ణులు కూడా ఉన్నారు. క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ రాగిణిది తూర్పుగోదావ‌రి జిల్లా రాజ‌మండ్రి ద‌గ్గ‌ర్లోనేని ఓ ప‌ల్లెటూరు. ఆమెకు చిన్న‌ప్ప‌టి నుంచే బాధ్య‌త‌లు మీద ప‌డ‌డంతో ఇండ‌స్ట్రీలో ఉన్నా పెళ్లి చేసుకోలేదు. ఆమె జీవితం కుటుంబానికే అంకితం చేశారు. ఇక తూర్పు గోదావ‌రి జిల్లా కాకినాడ‌కు చెందిన ర‌జిత చిన్న‌ప్ప‌టి నుంచే న‌టి కావాల‌న్న కోరిక‌తో ఉన్నా ఆమె ఆధ్యాత్మిక భావానికి ప్ర‌భావితురాలై పెళ్లి దూరంగా ఉంది.

Rajitha Telugu Tollywood Movie Heroine Actress Profile &  Biography-TeluguStop

కేర‌ళ‌లో నాయ‌ర్ కుటుంబంలో పుట్టిన సితార ముర‌ళీని ప్రేమించినా ఈ బంధం పెళ్లి వ‌ర‌కు వెళ్ల‌లేదు. త‌ర్వాత ఆమె ఎవ్వ‌రిని పెళ్లాడ‌లేదు. ఇక కేర‌ళ‌కే చెందిన సీనియ‌ర్ న‌టీమణి శోభ‌న పెళ్లి చేసుకోక‌పోయినా ఓ పాప‌ను ద‌త్త‌త తీసుకుంది. ఇక సీనియ‌ర్ న‌టీమ‌ణి న‌గ్మా శ‌ర‌త్‌కుమార్‌, క్రికెట‌ర్ సార‌వ్ గంగూలీ లాంటి వాళ్ల‌తో ప్రేమాయ‌ణం న‌డిపినా ఇంకా పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండిపోయింది. ఇంకా ఈ లిస్టులో మ‌రి కొంద‌రు న‌టీమ‌ణులు కూడా ఉన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news