Politicsచైనాకు ఒకేసారి రెండు బిగ్ షాక్‌లు... ప్ర‌పంచం మొత్తం సంబ‌రాల్లో మునిగింది...!

చైనాకు ఒకేసారి రెండు బిగ్ షాక్‌లు… ప్ర‌పంచం మొత్తం సంబ‌రాల్లో మునిగింది…!

ప్ర‌పంచానికి క‌రోనా వైర‌స్ అంటించ‌డంతో పాటు త‌మ త‌ప్పేంలేద‌న్న‌ట్టుగా రంకెలు వేస్తోన్న డ్రాగ‌న్‌కు వ‌రుస పెట్టి షాకుల మీద షాకులు త‌గులుతున్నాయి. ఇప్ప‌టికే ప్ర‌పంచ వ్యాప్తంగా అనేక దేశాలు చైనాతో ఉన్న వ్యాపార సంబంధాలు తెంచుకుంటున్నాయి. దీంతో విల‌విల్లాడుతోన్న చైనాకు ఇప్పుడు మ‌రో రెండు బిగ్ షాక్‌లు త‌గిలాయి. ఇప్పటికే మ‌న దేశం చైనాకు సంబంధించిన అన్ని యాప్‌లు నిషేధించింది. దీంతో చైనాకు కొన్ని కోట్ల రూపాయ‌ల న‌ష్టం వాటిల్లింది.

 

ఇక ఇప్పుడు అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ సైతం చైనాకు మ‌రో షాక్ ఇచ్చారు. ఇప్ప‌టికే చైనాతో ఉన్న ప‌లు వ్యాపార ఒప్పందాల‌ను ర‌ద్దు చేసుకుంటున్న‌ట్టు ప్ర‌క‌టించిన ట్రంప్ తాజాగా చైనాకే చెందిన వీడియో యాప్‌ టిక్‌టాక్‌పై అమెరికాలో నిషేధం విధించనున్నట్లు ప్రకటించారు. టిక్ టాక్‌ను భార‌త్‌తో సహా ప‌లు దేశాలు బ్యాన్ చేస్తోన్న నేప‌థ్యంలో ఈ యాప్‌ను అమెరికు చెందిన ప్ర‌ముఖ టెక్నాల‌జీ దిగ్గ‌జం మైక్రోసాఫ్ట్ సొంతం చేసుకునేందుకు ప్ర‌య‌త్నాలు ప్రారంభించింది. అంత‌లోనే ట్రంప్ ఈ షాకింగ్ డెసిష‌న్ తీసుకుని టిక్ టాక్‌కు బిగ్ షాక్ ఇచ్చారు.

 

ఇదిలా ఉంటే చైనీస్‌ యాప్‌ స్టోర్‌ నుంచి శనివారం అకస్మాత్తుగా 29,800 యాప్‌లను స్మార్ట్‌ఫోన్‌ తయారీ దిగ్గజ సంస్థ యాపిల్‌ తొలగించింది. వ‌రుస షాకుల ప‌రంప‌ర‌లో చైనాకు ఇది మ‌రో షాక్ అనే చెప్పాలి. ఈ 29 వేల యాప్‌ల‌లో 26 వేల వ‌ర‌కు గేమింగ్ యాప్‌లే కావ‌డం విశేషం. ఇక లైసెన్స్‌లు లేని చైనా గేమ్ యాప్‌ల‌పై చైనా అధికారులు చ‌ర్య‌లు తీసుకుంటున్నందునే యాపిల్ ఇలా చేసిన‌ట్టు స‌మాఆరం.

 

ఇక ఈ యేడాది మొద‌ట వారంలో కూడా యాపిల్‌ తన యాప్‌ స్టోర్‌ నుంచి 2,500 టైటిళ్లను తొలగించింది. ఇందులో ప్రజాదరణ ఉన్న జింగా, సూపర్‌సెల్‌ వంటివి కూడా ఉన్నాయ‌ట‌. ఏదేమైనా చైనాకు వ‌రుస షాకులు త‌గులుతుండ‌డంతో ప్ర‌ప‌చంలో ఎన్నో దేశాల ప్ర‌జ‌లు ఇప్పుడు సంబ‌రాలు చేసుకుంటూ చైనాకు త‌గిన శాస్తి అంటూ సంబ‌ర ప‌డుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news