తెలుగులో ఇరవై సంవత్సరాల క్రితం కొన్ని యూత్ సినిమాల్లో నటించాడు రోహిత్. ముఖ్యంగా 6 టీన్స్ లాంటి సినిమాలతో రోహిత్ అప్పట్లో యూత్‌లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ఆ తర్వాత కొన్ని అవకాశాలు వచ్చినా ఎందుకు స్టార్ హీరో కాలేకపోయాడు. ఆ తర్వాత రోహిత్ ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు. తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో రోహిత్ కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. తన సినిమా జీవితంతో పాటు వ్యక్తిగతంగా కెరీర్లో ఎదుర్కొన్న ఒడిదుడుకులు గురించి చెప్పాడు.
తాను సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో సొంతం, గర్ల్‌ఫ్రెండ్, గుడ్ బాయ్, జానకీ వెడ్స్ శ్రీరామ్, కీలుగుర్రం లాంటి సినిమాలు సూపర్ హిట్ అయ్యాయని… ఆ సినిమాల్లో సంపాదించిన దాంతో కొన్ని వ్యాపారాల్లో భారీగా పెట్టుబడులు పెట్టి నష్టపోయానని రోహిత్ చెప్పారు. ఇక కర్నూలు జిల్లా రాజకీయాల్లో యాక్టివ్ కావాలని తనకు పొలిటికల్ ఆఫర్లు వచ్చినా వాటిని తిరస్కరించినట్టు రోహిత్ చెప్పాడు.
ఇటీవల తన బంధువులకు తెలిసిన అమ్మాయిని పెళ్లి చేసుకుని హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేస్తున్నానని కూడా రోహిత్ చెప్పాడు. ఏదేమైనా 1998 – 2002 మధ్య కొన్ని మంచి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన రోహిత్ మళ్లీ చాలా రోజుల తర్వాత ఈ ఇంటర్వ్యూ ద్వారా తెరపైకి వచ్చాడు.