బంగారం ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్ అనే చెప్పాలి. గత వారం రోజులుగా బంగారం, వెండి ధరల రేట్లు పతనం అవుతూనే ఉన్నాయి. గత వారం రోజుల్లో బంగారం రేట్లు ఆరోసారి తగ్గాయి. ఇంటర్నేషనల్ మార్కెట్‌లో బంగారం ధరలు ఒడిదుడుకులతో సాగడంతో దేశీ మార్కెట్‌లోనూ బంగారం ధరలు బాగా తగ్గుతున్నాయి. ఎంసీఎక్స్‌లో గురువారం 10 గ్రాముల బంగారం రు. 435 తగ్గి 51,344కు దిగివచ్చింది.
ఇక రు. 884 తగ్గిన కిలో వెండి 66,645 రూపాయలకు పడిపోయింది. ఏదేమైనా కరోనా నేపథ్యంలో కూడా కొద్ది నెలలుగా బంగారం రేట్ల దూకుడుకు అడ్డూ అదుపు లేదు. ఇక ఇప్పుడు బంగారం రేట్లు తగ్గుతుండడంతో బంగారం ప్రియులు భారీగా బంగారం కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. వచ్చే యేడాది ఆరంభానికి బంగారం రేట్లు మరింత క్షీణిస్తాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.