Moviesపెళ్లికి రెడీ అయ్యి విడిపోయిన హీరో, హీరోయిన్లు వీళ్లే

పెళ్లికి రెడీ అయ్యి విడిపోయిన హీరో, హీరోయిన్లు వీళ్లే

సినిమా ఇండ‌స్ట్రీలో ప్రేమ‌లు, పెళ్లిళ్లు, విడిపోవ‌డాలు చాలా చాలా కామ‌న్‌. వీరు ఎంత త్వ‌ర‌గా ప్రేమించుకుంటారో అంతే త్వ‌ర‌గా విడిపోతారు. ఎప్పుడు ఎవ‌రు ఎవ‌రిని ప్రేమిస్తారో ?  ఎవ‌రితో ఉంటారో ?  ఎవ‌రితో విడిపోతారో ?  చివ‌ర‌కు ఎవ‌రిని చేసుకుంటారో వీరికే అర్థం కాదు. సినిమా వాళ్ల‌లో చాలా జంట‌లు ప్రేమించుకుని.. ఏళ్ల‌కు ఏళ్లుగా తిరిగి పెళ్లి చేసుకుంటాం అని చెప్పి చివ‌ర‌కు విడిపోతుంటారు. ఈ లిస్టు పెద్ద‌దే అయినా కొంద‌రు ప్ర‌ముఖ హీరో, హీరోయిన్ల ప్రేమ‌లు ఎలా పెటాకులు అయ్యాయో చూద్దాం.

న‌య‌న‌తార ముందుగా శింబుతో ప్రేమాయ‌ణం న‌డిపింది.. ఆ త‌ర్వాత పెళ్లి వ‌ర‌కు వెళ్లాక వీరు విడిపోయారు. ఆ త‌ర్వాత ప్ర‌భుదేవాతో ప్రేమ‌న‌డిపి పెళ్లి చేసుకునే వ‌ర‌కు వెళ్లింది. న‌య‌న‌ను పెళ్లి చేసుకునేందుకే ప్ర‌భు త‌న భార్య‌కు విడాకులు ఇచ్చాడు. ఇప్పుడు విఘ్నేష్ శివ‌న్‌తో ప్రేమ‌లో ఉంది. ఇక త్రిష కూడా శింబును ప్రేమించింది.. ఆ త‌ర్వాత రానాతో ఆమె య‌వ్వారాలు అన్ని ప‌బ్లిక్‌గానే బ‌య‌ట ప‌డ్డాయి. ఇక బాలీవుడ్‌లో 1990లో పోడుగు కాళ్ల సుంద‌రి శిల్పాశెట్టి – అక్ష‌య్‌కుమార్ ప్రేమించుకున్నారు. కానీ అక్ష‌య్ శిల్పాకు హ్యాండ్ ఇచ్చి మ‌రో హీరోయిన్ ట్వింకిల్ ఖ‌న్నాను పెళ్లాడు. శిల్పాతో విడిపోయాక అక్ష‌య్ ర‌వీనా టాండ‌న్‌తోనూ ప్రేమాయ‌ణం న‌డిపాడు.

ఇక ఉద‌య్‌కిర‌ణ్ కు , మెగాస్టార్ చిరు పెద్ద కుమార్తె సుస్మిత‌తో ఎంగేజ్‌మెంట్ కూడా అయ్యింది. ఆ త‌ర్వాత ఇది క్యాన్సిల్ అయ్యింది. ఇది అప్ప‌ట్లో పెద్ద సంచ‌ల‌నం. ఇక ఆర్తి అగ‌ర్వాల్ – త‌రుణ్ ప్రేమాయ‌ణం అప్ప‌ట్లో ఇండ‌స్ట్రీలో పెద్ద హాట్ టాపిక్‌. ఇక శింబు – హ‌న్సిక కూడా ప్రేమించుకుని పెళ్లి వ‌ర‌కు వెళ‌తార‌నుకున్న టైంలో విడిపోయారు. ఇంకా ఇలాంటి హీరో, హీరోయిన్ల లిస్టు చాలానే ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news