కరోనా విషయంలో భారత్‌కు భవిష్యత్తులో పెద్ద ముప్పే పొంచి ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. మిగిలిన ప్రపంచ దేశాలతో పోలిస్తే అమెరికా కరోనా వైరస్‌పై బాగా పోరాడుతోందన్న ఆయన ఈ వైరస్ భారత్‌కు అతి పెద్ద సమస్యగా ఉందని అన్నారు. చైనాలోనూ మళ్లీ అకస్మాత్తుగా కేసులు నమోదు అవుతున్నాయన్న ఆయన భారత్‌కు మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా పలు పెద్ద దేశాలకు కరోనాతో ఎంతో ముప్పు పొంచి ఉందని చెప్పారు.
ఇతర పెద్ద దేశాలతో పోల్చుకుంటే అమెరికా కరోనా వైరస్ విషయంలో ఎంతో గొప్పగా పోరాడుతోందన్న విషయం తాము చెప్పగలుగుతున్నామని.. వైరస్‌ను కట్టడి చేశామని చెప్పుకుంటోన్న దేశాల్లోనూ ఇప్పుడు విపరీతంగా కేసులు పెరుగుతుండడం తీవ్ర ఆందోళనకు గురి చేస్తోందన్నారు. ఇక మనదేశంలో రోజూ 50 వేల కొత్త కేసులు నమోదు అవుతుండగా.. ఇప్పటికే మొత్తం 18 లక్షలకు పైగా కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లోనే దేశంలో 52 వేల కేసులు వెలుగు చూశాయి. మరోవైపు డబ్ల్యూహెచ్‌వో సైతం కోవిడ్‌కు చికిత్స లేదని చెప్పడంతో ప్రపంచ వ్యాప్తంగా మరింత ఆందోళన కలుగుతోంది.