దివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ గురించి ఇప్పుడు ఏ న్యూస్ వచ్చినా బాగా వైరల్ అవుతోంది. ఈ క్రమంలోనే సుశాంత్‌సింగ్‌కు స్టార్ హీరో సైఫ్ ఆలీఖాన్ కుమార్తె, క్రేజీ హీరోయిన్ సారా ఆలీఖాన్ మధ్య ప్రేమాయణం నడిచిందన్న గుసగుసలు కూడా వస్తున్నాయి. ఈ ప్రేమను సుశాంత్ స్నేహితుడు శామ్యూల్ మిరండా చెప్పడంతో దీనిపై బీ టౌన్లో పెద్ద చర్చే నడిచింది. తాజాగా దీనిపై సుశాంత్ మాజీ అసిస్టెంట్ సాబిర్ అహ్మదర్ స్పందించాడు.
గతంలో వీరిద్దరితో కలిసి తాను ఓ ప్రైవేట్ జెట్‌లో థాయ్‌లాండ్ ట్రిప్‌కు వెళ్లిన మాట నిజమే అని చెప్పాడు. ఈ ట్రిప్‌లో మొత్తం ఆరుగురం కలిసి వెళ్లామని.. సుశాంత్, సారా బ్యాంకాక్‌లోని ఓ విలాసవంతమైన హోటల్లో బసచేసినట్లు వెల్లడించాడు. మిగిలిన వారు అక్కడ ప్రదేశాలను చూడడానికి వెళితే వీరిద్దరు మాత్రం అక్కడ హోటల్‌ల్లోనే గడిపారని సాబిర్ చెప్పాడు. ఈ ట్రిప్ కోసమే సుశాంత్ రు. 70 లక్షలు ఖర్చు చేశాడని సాబిర్ చెప్పాడు.
ఇక సుశాంత్ డిప్రెషన్‌కు గురయ్యే ఛాన్సే లేదని.. అతడు ఎప్పుడూ అందరితోనూ సంతోషంగా గడుపుతాడని చెప్పాడు. ఇక తాను సుశాంత్ దగ్గర పనిచేసినప్పుడు డ్రగ్స్ కూడా తీసుకోలేదని.. అతడికి ఆ అలవాటు లేదని చెప్పాడు. సుశాంత్-సారా కేదార్నాథ్’ సినిమాలో కలిసి నటించారు. ఆ సమయంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించిందన్న వార్తలు వచ్చినా వీరెవ్వరు స్పందించలేదు.