సుశాంత్ గ‌ర్ల్‌ఫ్రెండ్ రియాకు ఈడీ షాక్‌… ఆ రెండిటితోనే అడ్డంగా దొరికిపోయిందా..!

బాలీవుడ్ దివంగ‌త యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో రోజుకో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వ‌స్తోంది. నిన్న‌టికి నిన్న రియా భాయ్ ఫ్రెండ్ పేరు వెలుగులోకి వ‌చ్చింది. ఇదిలా ఉంటే ఇటీవ‌ల సుశాంత్ ఆత్మ‌హ‌త్య చుట్టూ అతని గర్ల్ ఫ్రెండ్, నటి రియా చక్రవర్తి ఆరోపణలు ఎదుర్కొంటోన్న సంగ‌తి తెలిసిందే. తాజాగా రియాకు ఈడీ స‌మ‌న్లు జారీ చేసింది. త‌మ ముందు విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని కూడా స్ప‌ష్టం చేసింది.

 

సుశాంత్ ఖాతా నుంచి ఆమె రు. 15 కోట్లు మాయం చేసింద‌ని కూడా సుశాంత్ తండ్రి బిహార్‌లోని పాట్నా పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌గా.. ఈ కేసు విచార‌ణ నేప‌థ్యంలో పాట్నా వ‌ర్సెస్ బిహార్ పోలీసుల మ‌ధ్య వార్ కూడా న‌డుస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇక రియా ఇటీవ‌ల కాలంలో రెండు హై ఎండ్ రియ‌ల్ ఎస్టేట్ ప్రాప‌ర్టీలు కొనుగోలు చేయ‌డంతో వాటికి ఎక్క‌డ నుంచి డ‌బ్బులు స‌మ‌కూరాయ‌న్న‌దానిపై కూడా ఈడీ కూపి లాగ‌డంతో పాటు ఆమెకు స‌మ‌న్లు జారీ చేసిన‌ట్టు స‌మాచారం.

 

ఈ రెండు ప్రాప‌ర్టీల విష‌యంలోనే ఆమె అడ్డంగా బుక్ అయ్యింద‌ని అంటున్నారు. సుశాంత్ ఆత్మహత్య కేసులో సీబీఐ విచారణకు కేంద్రం కూడా తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇకపోతే సుశాంత్ సింగ్ ముంబయిలోని బాంద్రా ప్రాంతంలోని తన ఇంట్లో జూన్ 14 న చనిపోయిన సంగ‌తి తెలిసిందే.

Leave a comment