బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ ట్విస్టుల పరంపరలో మరో ట్విస్టు వెలుగు చూసింది. సుశాంత్ బావమరిది హర్యానా ఐపీఎస్ ఆఫీసర్ ఓపీ సింగ్.. శామ్యూల్ మిరాండా అనే వ్యక్తిని ఇల్లీగల్‌గా అదుపులోకి తీసుకుని విచారించాలని కోరినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని బాంద్రా మాజీ డిప్యూటీ కమిషనర్ పరంజిత్ సింగ్ దాహియా తెలిపారు. ఫిబ్రవరిలోనే సుశాంత్ ప్రాణానికి ముప్పుఉందని బాంద్రా పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆయన తండ్రి కేకే సింగ్ చేయగా.. ఇప్పుడు దానికి సంబంధించిన స్క్రీన్ షాట్ కూడా మీడియాకు రిలీజ్ చేశారు.
ఇక సుశాంత్ బావమరిది ఓపీ సింగ్ సుశాంత్ గర్ల్‌ఫ్రెండ్ రియాను పోలీస్ స్టేషన్‌కు పిలిచి బెదిరించాలని.. ఆమె స్నేహితుడు శామ్యూల్ మిరాండాను కూడా అదుపులోకి తీసుకోవాలని ఓపీ సింగ్ కోరారు. ముంబై పోలీసులు ఒక రోజు మిరాండాను అదుపులో ఉంచితే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని కూడా ఓపీ సింగ్ చెప్పారని పరంజిత్ సింగ్ చెప్పారు. ఫిర్యాదు లేకుండా తాము విచారణ చేయలేమని సింగ్‌కు చెప్పిన విషయాన్ని సైతం పరంజిత్ వెల్లడించారు.
ఈ సంఘటన జరిగిన తర్వాత సింగ్ ఎప్పుడూ తనని సంప్రదించలేదని.. ఏప్రిల్ 1 తర్వాత తాను బాంద్రా స్టేషన్ నుంచి బదిలీ అయినట్లు పరంజిత్ వెల్లడించారు. కాగా, సుశాంత్ సింగ్ కేసు సీబీఐకు అప్పగించాలని బీహార్ ప్రభుత్వం చేసిన సిఫార్సుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.