పరిపాలనా వికేంద్రీకరణ, రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీయే చట్టం రద్దుపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం వెలువడించింది. హైకోర్టులో కేసు విచారణ జరుగుతుండడంతో తాము జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఏపీ ప్రభుత్వ పిటిషన్‌పై విచారణ చేపట్టేందుకు సుప్రీం నిరాకరించింది. ఇక ఈ కేసు రేపు హైకోర్టులో విచారణకు రానుంది. హైకోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో తాము ఈ అంశంలో తలదూర్చలేమని తేల్చిచెప్పింది.
అలాగే వీలైనంత త్వరగా కేసును ముగించాలని కూడా సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు విజయవాడలో రాజధాని రైతులు ఏఎంఆర్డీయే కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నిస్తున్నారు. తమ కౌలు డబ్బులు చెల్లించాలని వారు నిరసనకు దిగారు. వీరంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఏదేమైనా ఇప్పుడు బంతి హైకోర్టు పరిధిలో ఉండడంతో హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందా ? అన్న ఆసక్తి నెలకొంది.