శ్రీరాముడి హిందువుల ఆరాధ్య దైవం. భారతదేశ వ్యాప్తంగా ఎన్నో సంచలనాలకు కేంద్ర బిందువుగా ఉన్న పవిత్ర క్షేత్రం అయిన అయోధ్యకు శ్రీరాముడికి ఉన్న సంబంధం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక శ్రీరాముడు ఎప్పుడు పుట్టాడు ? నిజంగానే ఆయన అయోధ్య వీథుల్లో నడియాడాడా ? రాయయణ ఇతివృత్తానికి అయోధ్యే కీలకంగా నిలిచిందా ? దీనిపై పురాతత్వ శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల్లో ఏం తేలింది ? శ్రీరాముడు ఎక్కడ పుట్టాడు ? ఆయన ఎప్పుడు పుట్టాడు ? పురాణాలు ఏం చెపుతున్నాయి లాంటి ప్రశ్నలకు తాజా పరిశోధనలో ఆసక్తికర సమాధానాలే వెల్లడి అయ్యాయి.
శ్రీరాముడు అయోధ్యలోనే పుట్టాడన్న విషయంలో అందరికి క్లారిటీ ఉంది. ఆయన రావణుడు నుంచి సీతను విడిపించే క్రమంలోనే దండకారణ్యం ( ఈ నాటి చత్తీస్‌ఘడ్ అడవులు) మీదుగా వస్తూ భద్రాచలంలో కొద్ది రోజులు ఉండడం ఆ తర్వాత రామేశ్వరం మీదుగా బ్రిడ్జి వేసుకుని లంకకు వెళ్లాడన్నది ఇప్పటి వరకు మనకు తెలిసిన ఇతివృత్తం. ఇక శ్రీరాముడు ఎప్పుడు పుట్టాడన్నది మాత్రం ఎవ్వరికి కరెక్టుగా తెలియదు. ఆయన వయస్సు ఎంతన్నది కూడా ఎవ్వరికి క్లారిటీ లేదు. అయితే వాల్మీకి రామాయణంలో.. శ్రీరాముడు వనవాసానికి వెళ్లే సమయానికి ఆయన వయస్సు 25 ఏళ్లుగా తెలిపారు.
ఇక వాల్మీకి రామాయణం చెప్పిన దానిని బట్టి చూస్తే చైత్రశుద్ధ నవమి.. కర్కాటక లగ్నంలో.. పునర్వసు నక్షత్రంలో శ్రీరాముడు జన్మించాడు. రామాయణంలో వాల్మీకి చెప్పిన అంశాలను ఆధారంగా చేసుకుని చూస్తే ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చ్ ఆన్ వేదాస్ సంస్థ చేసిన పరిశోధనల్లో ఆయన పుట్టిన రోజు ఖచ్చితంగా నిర్దారణ చేసి శ్రీరాముని జన్మదినానికి సంబంధించిన వివరాలను శాస్త్రవేత్తలు ప్రకటించారు.
శ్రీరాముడు క్రీస్తు పూర్వం 5వేల 114లో జనవరి 10వ తేదీన.. మధ్యాహ్నం 12 గంటల తర్వాత జన్మించినట్లు నిర్ధారించింది. ప్రత్యేక సాఫ్ట్ వేర్ ద్వారా.. శాస్త్రవేత్తలు రాముడి పుట్టినరోజు గురించి సమయం, సంవత్సరంతో సహా చెప్పగలిగారు. సో వీరు ఎంతో పరిశోధన తర్వాత ఇలా శ్రీరాముని బర్త్ డే ఎప్పుడు చెప్పగలిగారు. ఇది ఖచ్చితమేనని వారు చెపుతున్నారు.