ఇండస్ట్రీ అన్నాక హీరోలు, హీరోయిన్లు, టెక్నీషీయిన్ల మధ్య పోటీ సహజం. ఈ క్రమంలోనే కొద్ది రోజులుగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్లు పూజ హెగ్డే, సమంత మధ్య వార్ ముదురుతోంది. ఈ ఇద్దరు హీరోయిన్ల అభిమానుల మధ్య సోషల్ మీడియా వేదికగా పోటాపోటీ కామెంట్లతో ఇది రోజు రోజుకు మరింతగా ఎక్కువ అవుతోంది. కొద్ది రోజుల క్రితం పూజా హెగ్డే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయ్యింది. ఈ విషయాన్ని పూజా తన ట్విట్టర్ వేదికగా అభిమానులకు తెలిపింది.
నా అక్కౌంట్ ఎవరో హ్యాక్ చేశారు.. ఆ అక్కౌంట్ నుంచి వచ్చే విషయాలు ఎవ్వరూ పట్టించుకోవద్దని.. అలాగే ఎవ్వరూ ఎటువంటి వ్యక్తిగత సమాచారం కూడా ఆ అక్కౌంట్‌తో పంచుకోవద్దని పెట్టిన కొద్దిసేపటికే సమంతపై ఓ అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పూజా ఇన్‌స్టా గ్రామ్‌లో ఓ పోస్ట్ ప్రత్యక్షమైంది. అయితే ఆ పోస్టు పూజ పెట్టకపోయినా సమంత ఫ్యాన్స్ ఆమెను టార్గెట్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ఇద్దరు హీరోయిన్ల అభిమానుల మధ్య వార్ రోజు రోజుకు ముదురుతూ వస్తోంది.
ఈ వివాదం విషయమై ఇప్పటివరకు సదరు హీరోయిన్స్ ఇద్దరూ కూడా నోరు విప్పలేదు. చివరకు ఆ ఇద్దరు హీరోయిన్లు బాగానే ఉన్నా సోషల్ మీడియాలో ఈ ఇద్దరు హీరోయిన్ల అభిమానులు మాత్రం ఒకరి పోస్టుకు మరొకరు నెగిటివ్ కామెంట్లు పెడుతూ లేని రచ్చ క్రియేట్ చేస్తున్నారు.