కరనా మహమ్మారి మనదేశంలో జోరు చూపిస్తోంది. ఓ విధంగా చెప్పాలంటే ఇప్పటికే పీక్‌స్టేజ్‌కు వెళ్లిపోయిన కరోనా మరో నెల రోజుల్లో దాదాపు దేశంలో అన్ని గ్రామాలకు కూడా పాకేస్తుందన్న విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటి వరకు ఉన్న లెక్కలను బట్టి చూస్తే ఇండియాలో కరోనా పాజిటివ్ కేసుఉల 31.64 లక్షలకు చేరుకున్నాయి. ఇక మరణాలు 58 వేలు దాటేశాయి. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 5 నుంచి 17 సంవత్సరాల మధ్య ఉన్న పిల్లలు, టీనేజర్లకు కరోనా వైరస్ సోకే అవకాశాలు ఎక్కువుగా ఉన్నాయని సీరం తాజా సర్వేలో వెల్లడైంది.
ఆగస్టు తొలి వారంలో సీరం రెండో సారి ఈ సర్వే చేసింది. ఈ సర్వే ప్రకారం ఢిల్లీలో 29.1 శాతం మందిలో సార్స్ కోవ్-2తో పోరాడే ప్రతిరోధకాల అభివృద్ధి జరిగింది. ఈ సర్వేలో 15 వేల మంది పాల్గొన్నారు. వీరిలో 25 శాతం మంది 18 ఏళ్ల లోపువారే. ఇక 50 శాతం మంది 18 – 50 ఏళ్ల లోపు వారు ఉన్నారు. మిగిలిన వారు 50 ఏళ్ల పైబడిన వారు ఉన్నారు. ఇక 5 – 17 ఏళ్ల వయస్సు మధ్యలో ఉన్నవారిలో 34.7 శాతం మంది ఇన్‌ఫెక్షన్‌కు గురయ్యే అవకాశాలు ఎక్కువుగా ఉన్నాయని సర్వే ఫలితాలు చెపుతున్నాయి.
50 ఏళ్ల పైబడిన వారిలో 31.2 శాతం మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక ఇండియన్ మెడికల్ రీసెర్చ్ గణాంకాల ప్రకారం 21- 50 సంవత్సరాల వయస్సు మధ్యలో ఉన్న వారిలో 61.31 శాతం మంది కరోనా భారీన పడ్డారు. ఈ నిజాలు బయటకు వచ్చాక 5 – 17 సంవత్సరాల వయస్సులో ఉన్నవారు ఎంత జాగ్రత్తగా ఉండాలో అర్థమవుతోంది.