Gossipsపెళ్లికొడుకు కాబోతోన్న సాయిధ‌ర‌మ్‌.. సారీ ప్ర‌భాస్ అన్నా అంటూ ఆ గ్రూప్‌లో...

పెళ్లికొడుకు కాబోతోన్న సాయిధ‌ర‌మ్‌.. సారీ ప్ర‌భాస్ అన్నా అంటూ ఆ గ్రూప్‌లో లెఫ్ట్‌..!

లాక్‌డౌన్ స‌మ‌యంలో మ‌న తెలుగు హీరోలు ఒక్కొక్క‌రు పెళ్లిపీఠ‌లు ఎక్కేస్తున్నారు. ఇప్ప‌టికే నితిన్‌, నిఖిల్ ఓ ఇంటి వారు అయిపోయారు. ఇక ద‌ర్శ‌కుడు సుజీత్ సైతం మూడు ముళ్లు వేసేశాడు. ఇక కొంద‌రు హీరోయిన్లు సైతం పెళ్లిళ్లు చేసేసుకుంటున్నారు. నిర్మాత దిల్ రాజు రెండో వివాహం సైతం ఇటీవ‌ల జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కూడా పెళ్లి పీటలు ఎక్కడానికి రెడీ అయ్యాడనే టాక్ వినిపిస్తోంది.

మూడున్న‌ర ప‌దుల వ‌య‌స్సుకు ద‌గ్గ‌ర్లో ఉన్న సాయిధ‌ర‌మ్ పెళ్లిపై గ‌త రెండు, మూడేళ్లుగా వార్త‌లు వ‌స్తూనే ఉన్నాయి. తాజాగా సాయి కొద్ది క్ష‌ణాల క్రితం వ‌దిలిన వీడియోతో అత‌డు పెళ్లి పీఠ‌లు ఎక్క‌బోతున్నాడ‌న్న హింట్ ఇచ్చిన‌ట్ల‌య్యింది. ఆ వీడియోలో సాయి ఒక్కోసారి మ‌నం ఎన్న‌నుకున్నా… టైం వ‌చ్చిన‌ప్పుడు మ‌రి అంటూ త‌మ సింగిల్ ఆర్మీ వాట్సాప గ్రూప్ నుంచి లెఫ్ట్ అయిపోయాడు.

ఇక అస‌లు విష‌యం ఏంటో తెలియాలంటే రేపు ఉద‌యం 10 గంట‌ల వ‌ర‌కు వెయిట్ చేయాల‌ని చెప్పాడు. ఇక టాలీవుడ్ బ్యాచిల‌ర్ హీరోలు అంద‌రూ క‌లిసి ఓ వాట్సాప్ గ్రూప్ పెట్టుకున్నారు. ఇప్పుడు ఈ గ్రూప్ నుంచి పెళ్లి అవుతోన్న హీరోలు అంద‌రూ లెఫ్ట్ అవుతున్నారు. ఇప్పుడు ఈ గ్రూప్ నుంచి సాయి కూడా బ‌య‌ట‌కు వ‌చ్చేశాడంటే మ‌నోడి పెళ్లి కుదిరింద‌న్న చ‌ర్చ‌లు స్టార్ట్ అయ్యాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news