దివంగత సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటోన్న అతడి ప్రియురాలు రియా చక్రవర్తి తాజాగా ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు సంచలన విషయాలు చెప్పింది. సుశాంత్ మానసిక ఆరోగ్య పరిస్థితి సరిగా లేదని.. అతడు డిప్రెషన్‌కు గురవ్వడంతో ఆరు సంవత్సరాలుగా ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నాడని చెప్పింది. ఇదే ఇంటర్వ్యూలో ఆమె మరొన్ని విషయాలు కూడా చెప్పింది. గత అక్టోబర్లో తాము యూరప్ టూర్‌కు వెళ్లామని.. టూర్‌కు వెళ్లేందుకు ముందు కూడా సుశాంత్ చాలా అనారోగ్యంతో ఇబ్బంది పడుతూ ఉండేవాడని చెప్పింది.
టూర్‌కు వెళ్లాక కాస్త మారాడని.. ఇటలీ రోడ్లపై గెంతులు వేయడంతో పాటు చాలా ఉల్లాసంగా మాట్లాడేవాడని చెప్పింది. ఇక సుశాంత్‌కు ముందు నుంచి ఇరుకుగా ఉండే ప్రదేశాలు అన్నా.. గుహలు లేదా ఇసుక ప్రాంతాలు అంటే చాలా భయం అని రియా తెలిపింది. వాటిని చూస్తే సుశాంత్ మానసిక ఆందోళనకు గురవుతూ ఉంటాడని.. ఇక ఇటలీలో తాను ఉన్న రూంకు వెళ్లకముందు వరక బాగానే ఉన్న సుశాంత్ తర్వాత వింతగా ప్రవర్తించడం మొదలు పెట్టాడని చెప్పారు.
ఇక సుశాంత్ 2013 నుంచి హరేష్ శెట్టి అనే వైద్యుడి వద్ద ట్రీట్ మెంట్ తీసుకుంటున్నట్లుగా చెప్పాడు. అతడు ఇచ్చిన మందులను వేసుకుంటున్నట్లుగా కూడా తనకు చెప్పాడని.. ఏదేమైనా ఇటలీ వెళ్లాక తాను ఉన్న రూంకు మారినప్పటి నుంచే సుశాంత్ మానసిక స్థితి మరింత క్షీణించిందని రియా పేర్కొంది.