Moviesడ్ర‌గ్ డీల‌ర్‌తో రియా చాట్ గుట్టు ర‌ట్టు.... మీ ద‌గ్గ‌ర ఎంపీ...

డ్ర‌గ్ డీల‌ర్‌తో రియా చాట్ గుట్టు ర‌ట్టు…. మీ ద‌గ్గ‌ర ఎంపీ ఉందా…!

దివంగ‌త బాలీవుడ్‌ యువ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య కేసులో రోజుకో ట్విస్ట్‌ బయటకు వ‌స్తోంది. ఈ కేసును సీబీఐ విచారిస్తోన్న సంగ‌తి తెలిసిందే. తాజాగా రియాకు, డ్ర‌గ్ డీల‌ర్ల‌కు మ‌ధ్య జ‌రిగిన చాట్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ విచారణలో డ్రగ్స్ పేరుతో రియా చక్రవర్తికి నేరుగా సంబంధాలున్నట్లు ఈడీ తేల్చింది. డ్ర‌గ్ డీల‌ర్‌గా ఆరోప‌ణ‌లు ఉన్న గౌర‌వ్ ఆర్య‌తో రియా చేసిన చాట్ ఇలా ఉంది. ముందు రియా చాట్ చేస్తూ ‘నేను ఎక్కువ డ్రగ్స్‌ వాడలేదు’ అనే మెసెజ్ 2017 మార్చి 8న పంపింది.. ఇక రెండో సారి మీ వ‌ద్ద ఎంపీ ఉందా ? అని ఆమె గౌర‌వ్‌ను ప్ర‌శ్నించింది.

మిథిలీన్‌ డయాక్సీ మెథాంఫేటమిన్‌గా ఎంపీగా పరిగణిస్తారు. ఇది మంచి ప్ర‌భావంత‌మైన డ్ర‌గ్‌గా చెపుతారు. ఇక కొద్ది రోజుల క్రింద‌ట మహేష్‌ భట్‌, రియా వాట్సాప్‌ చాట్‌ వైరల్‌ అయిన విషయం తెలిసిందే. ఇక శామ్యూల్ మిరాండా, రియా మధ్య జరిగిన చాట్‌ను కూడా బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఇందులో శామ్యూల్ హాయ్ రియా విష‌యం దాదాపుగా క్లోజ్ అయ్యింద‌ని చెప్పాడు. ఈ సంభాష‌ణ 2020 ఏప్రిల్ 17 న జరిగింది. ఆ తరువాత రియా చాట్ చేస్తూ మేం షోవిక్ ఫ్రెండ్ నుంచి డ్ర‌గ్స్ తీసుకోవచ్చా ? అని శామ్యూల్‌ను అడిగింది.

అత‌డి ద‌గ్గ‌ర హాష్‌, మొగ్గ మాత్ర‌మే ఉన్నాయ‌ని కూడా రియా మిరాండాతో చెప్పింది. ఈ రెండు కూడా త‌క్కువ ప్ర‌భావం ఉన్న డ్ర‌గ్స్ గా చెపుతున్నారు. ఇక ప్రస్తుతం డ్రగ్‌ డీలర్‌తో జరిగిన ఈ సంభాషణను చూస్తుంటే రియాపై మరింత అనుమానాన్ని పెంచుతున్నాయి. రియా చక్రవర్తిని సీబీఐ అధికారులు ఏ క్షణంలోనైనా అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news