దివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణించిన తర్వాత ఎన్నో సంచలన విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అయితే ఈ విషయంలో ముందు నుంచి కూడా రిపబ్లిక్ టీవీ ఎన్నో సంచలన కథనాలు వండి వారుస్తోంది. ఈ క్రమంలోనే మరో సంచలన కథనాన్ని రియాపై రిపబ్లిక్ టీవీ ప్రచురించింది. తాజా కథనంలో సుశాంత్ మరణం తర్వాత రియా మీడియాలో తనకు పాజిటివ్‌గా కథనలు వచ్చేలా చక్రం తిప్పిందట. ఈ పరిశోధనాత్మక కథనంలో ఆమె బాలీవుడ్‌లోని ఓ దర్శకుడి సహకారంతో తన పీఆర్ టీం ద్వారా ఈ కథనాలు వచ్చేలా ప్లాన్ చేసిందని.. ఇందుకోసం ఆమె భారీగా డబ్బులు కూడా ఖర్చుచేసిందని పేర్కొంది.
ఇందుకోసం ఆమె ఆ దర్శకుడి సలహాలు చాలానే వాడుకుందట. ఇక ఆ సీనియర్ దర్శకుడి గురించి.. ఆమె అతడితో సాగించిన ఎఫైర్ గురించి కూడా ఇప్పటికే రకరకాలుగా ప్రచారం సాగుతోంది. దీంతో షాక్ అయిన రియా ఇప్పటికే అది తండ్రి, కూతుళ్ల బంధం అని చెప్పినా కూడా ఎవ్వరూ నమ్మడం లేదు. ఆ దర్శకుడితో తనకు ఉన్నది తండ్రి, కూతుళ్ల బంధం అని ఆమె వాట్సాప్ స్క్రీన్ షాట్లు బయటకు రిలీజ్ చేయగా.. ఆమె పీఆర్ టీం వాటిని సోషల్ మీడియాలో బాగా వైరల్ చేయిస్తున్నారు.
అయితే రిపబ్లిక్ టీవీ ఇదే అంశాన్ని బాగా ప్రస్తావించింది. ఇది తండ్రి కూతుళ్ల బంధం అనుకున్నప్పుడు దీనిని అంతగా పనికట్టుకుని వైరల్ చేయించాల్సిన అవసరం ఏముందని కూడా ప్రశ్నించింది. ఏదేమైనా ఈ కథనం తర్వాత సుశాంత్ మరణం వెనక రియా పాత్రపై మరిన్ని సందేహాలు కలుగుతున్నాయి.