దివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య తర్వాత అతడి మరణం గురించి ఎప్పటికప్పుడే ఏదో ఒక సంచలన వార్త బయటకు వస్తూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా అతడి ఆత్మహత్య కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటోన్న బాలీవుడ్ నటి రియా చక్రవర్తి, దర్శకనిర్మాత మహేశ్భట్లకు సంబంధించిన వాట్సప్ చాటింగ్ అంటూ సోషల్‌మీడియాలో కొన్ని చిత్రాలు వైరల్ అవుతున్నాయి. రియా తాను సుశాంత్‌ను వదిలిన విషయాన్ని బట్కు చెప్పినట్టు ఆ సందేశాలు చెపుతున్నాయి.
వీరి ప్రేమ వ్యవహారంలో హీరోయిన్ రియా తండ్రి ఆన్ హ్యాపీగా ఉన్నారని.. మహేశ్‌భట్ చేసిన చాటింగ్ ద్వారా తెలుస్తోంది. అదే విధంగా సుశాంత్‌కు వ్యతిరేకంగా దర్శకుడు హెచ్చరించాడని కూడా ఆ మెసేజ్‌లు చెపుతున్నాయి. ఈ మెసేజ్‌లు చూస్తుంటే రియా ఆనందంగా ఉన్నట్టు తెలుస్తుండడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. మహేశ్ భట్‌ను ఉద్దేశిస్తూ..’ఐ లవ్యూ మై బెస్ట్ మ్యాన్. మీరు గర్వించే విధంగా చేస్తా’ అని రియా మెసేజ్ చేసింది. ఇక సుశాంత్ రియాకు దూరం కావడం వెనక మహేష్ – రియా మధ్య ఎఫైర్ ఉందన్న పుకార్లు కూడా బయటకు వచ్చాయి.