భారత్‌పై కరోనా పగబట్టింది… రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతూ తన జోరు చూపిస్తోంది. గత వారం రోజులుగా రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతోన్న కరోనా మన దేశంలో 18 లక్షల పాజిటివ్ కేసులకు చేరుకుంది. గత వారం రోజులుగా చూస్తుంటే దేశంలో రోజుకు సగటున 50 వేల కేసులకు పైగా నమోదు అవుతున్నాయి. గత 24 గంటల్లో దేశంలో మరోసారి రికార్డు స్థాయిలో కేసులు నమోదు అయ్యాయి. ఇక మహారాష్ట్ర దేశంలోనే అత్యధిక కేసులతో తన రికార్డును కొనసాగిస్తోంది.
ఆదివారం ఒక్క రోజే 52,972 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 18,03,695కి చేరింది. గత 24 గంటల్లో 771 మరణాలతో కలుపుకుని.. మరణాల సంఖ్య మొత్తం 38,135కు చేరుకుంది. గత 24 గంటల్లో 40,574 మంది కోవిడ్ నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఈ లెక్కలన్ని చూస్తుంటే మనదేశంపై కరోనా ఎంతలా పగబట్టిందో అర్థమవుతోంది. దేశ వ్యాపంగా రికవరీ రేటు 65.77శాతంగా ఉంది. ఈ విషయంలో మాత్రం కాస్త ఉపశమనం లాంటిదే.