దివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత ప్రతి రోజు దేశవ్యాప్తంగా సుశాంత్ పేరు మీడియా వర్గాల్లో నానుతూనే ఉంది. ఇక సుశాంత్ మరణం తర్వాత దేశవ్యాప్తంగా ఎన్నో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చినా అవేవి సుశాంత్ కథనాలను బీట్ చేయలేకపోయాయి. ఈ విషయం బ్రాడ్ కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్- నెల్సన్ సంస్థలు చేసిన మార్కెటింగ్ రీసెర్చ్ సర్వేలో వెల్లడయ్యాయట. ప్రైమ్ టీవీ న్యూస్‌లో భాగంగా గత నాలుగు వారాలుగా సుశాంత్ డెత్ న్యూస్ టాప్‌లో ఉంది.
జూన్ 14న సుశాంత్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ మృతిపై ఇప్పటకీ అనేక రకాల సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే సుశాంత్ మృతి వెనక ఏదో మిస్టరీ దాగి ఉందన్న వార్తలు మాత్రం ప్రతి రోజూ వస్తూనే ఉంటున్నాయి. అందుకే ఈ వార్తలపై ప్రతి ఒక్కరికి తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ప్రతి రోజూ ఏదో ఒక సుశాంత్ వార్త హెడ్‌లైన్స్‌ల్లో హల్‌చల్ చేస్తూనే ఉంటోంది. ఆ తర్వాత ఆగస్టులో అయోధ్య రామమందిర నిర్మాణానికి భూమి పూజ జరిగింది.
అన్ని ఛానెల్స్ ఈ వార్తను ప్రసారం చేసినా మెయిన్ కాన్‌సంట్రేషన్ అంతా సుశాంత్ కేసు మీదే పెట్టాయి. ఆ తర్వాత కోజికోడ్ ఏయిర్ క్రాఫ్ట్ క్రాష్ దుర్ఘటన.. రాజస్థాన్ రాజకీయ సంక్షోభం.. ఎం.ఎస్ థోనీ రిటైర్మెంట్ ఎన్ని అంశాలు వచ్చినా కూడా సుశాంత్ వార్తలను బీట్ చేయలేకపోయాయి. ఇక లాక్‌డౌన్ తర్వాత టీవీ వ్యూవర్‌షిఫ్ 200 శాతం పెరిగితే అందులో 100 శాతానికి పైగా సుశాంత్ వార్తలకే వచ్చిందట.