టాలీవుడ్‌లో ప్రస్తుతం యంగ్‌హీరోలు లాక్‌డౌన్ ఉన్నా… షూటింగ్‌లు లేకపోయినా వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. డార్లింగ్ ప్రభాస్ మిగిలిన హీరోలకు అందనంత ఎత్తులో ఉన్నాడు. బాహుబలి, సాహో, రాధేశ్యామ్, నాగ్ అశ్విన్ సైన్స్‌ఫిక్షన్, ఆదిపురుష్ ఇలా వరుసగా పాన్ ఇండియా సినిమాలే చేసుకుంటూ పోతున్నాడు. ప్రభాస్ మార్కెట్ ప్రస్తుతం స్కై రేంజ్‌ను దాటేసింది. ఇక అల్లు అర్జున్ కూడా వరుసగా పాన్ ఇండియా సినిమాలే చేస్తున్నాడు.
అల సూపర్ హిట్ తర్వాత ప్రస్తుతం చేస్తోన్న పుష్ప ఆ తర్వాత కొరటాల సినిమాను సైతం పాన్ ఇండియా రేంజ్‌లోనే ప్లాన్ చేస్తున్నాడు. ఇక ఈ విషయంలో ఎన్టీఆర్ కూడా ముందే ఉన్నాడు. ఆర్ ఆర్ ఆర్ తర్వాత వరుసగా త్రివిక్రమ్, ప్రశాంత్ నీల్ సినిమాను సైతం పాన్ ఇండియా రేంజ్‌లో ప్లాన్ చేస్తున్నాడు. మహేష్ కూడా సర్కారు వారి పాట తర్వాత పాన్ ఇండియా రేంజ్ ప్రాజెక్టు ప్లాన్ చేస్తున్నాడు. ఆ తర్వాత త్రివిక్రమ్, అనిల్ రావిపూడికి కూడా ఓకే చెప్పాడంటున్నారు.
వీళ్లతో పోలిస్తే చరణ్ మాత్రం ఎందుకనో స్థబ్ధుగా ఉన్నారు. ప్రభాస్, బన్నీ, ఎన్టీఆర్, మహేష్ వరుసగా ప్రాజెక్టుల మీద ప్రాజెక్టులు ఒప్పుకుంటున్నారు. చరణ్ మాత్రం ఆర్ ఆర్ ఆర్, ఆచార్య తప్పా ఏం ప్రాజెక్టును ఒప్పుకోలేదు. దీంతో పైన స్టార్ హీరోల మార్కెట్ ఒక్కసారిగా ఫుల్‌స్వింగ్‌లో ఉండడంతో పాటు వాళ్ల సినిమాలపై అప్పడే అంచనాలు ఉన్నా చరణ్ విషయంలో ఆర్ ఆర్ ఆర్ తర్వాత ఏం ప్రణాళిక లేనట్టే కనపడుతోంది. మరీ ఈ టైంలోనే మంచి కథలు విని ఓకే చేసి పెట్టుకుంటే తర్వాత చరణ్‌కు వరుసగా సినిమాలు చేయడం ఈజీ అవుతుంది.