దివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ విషయంలో ముందు నుంచి ఎన్నో సందేహాలు లేవనెత్తుతోన్న బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. విష ప్రయోగం వల్లే సుశాంత్ మరణించాడంటూ ఆయన మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సుశాంత్ చనిపోయాక కడుపులో ఉన్న విషం అనవాళ్లు లేకుండా పోయాకే పోస్టుమార్టం చేశారని ఆయన అన్నారు.
ఇక సుశాంత్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించడంలో ఉద్దేశ పూర్వకంగానే ఆలస్యం చేశారని.. ఇక హంతకుల మనస్తత్వం, వారి ఉద్దేశం త్వరలోనే బయటకు వస్తుందని కూడా ఆయన తెలిపారు. ఈ క్రమంలోనే స్వామి మరో సంచలన సందేహం లేవనెత్తారు. సుశాంత్ సన్నిహితుడిగా పేరొందిన సందీప్ సింగ్ తీరుపై కూడా సుబ్రహ్మణ్య స్వామి పలు అనుమానాలు వ్యక్తం చేశారు. అతడు పదే పదే దుబాయ్‌కు వెళ్లాల్సిన అవసరం ఏంటన్నదానిపై కూడా విచారణ చేయాలన్నాడు.
ఈ క్రమంలో సుశాంత్ హత్య జరిగిన రోజున దుబాయ్ కంప్లైంట్ డ్రగ్ డీలర్ అయాష్ ఖాన్ సుశాంత్ సింగ్‌ను కలిశారంటూ స్వామి ఇంతకు ముందే సందేహం వ్యక్తం చేశారు.