దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ ప్రాజెక్టుతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో ఈ సినిమాకు కాస్త బ్రేక్ ఇచ్చారు. అంతలోనే రాజమౌళితో పాటు ఆ ఫ్యామిలీ అంతా కరోనా భారీన పడింది. పది రోజుల పాటు క్వారంటైన్‌లో ఉన్న రాజమౌళి ఫ్యామిలీ ఇప్పుడిప్పుడే కరోనా నుంచి కోలుకున్న ఈ ఫ్యామిలీ మళ్లీ సినిమా వ్యవహారాల్లో బిజీ అవుతోంది. ఇదిలా ఉంటే కరోనా నుంచి కోలుకున్నాక రాజమౌళి ఇచ్చిన తొలి ఇంటర్వూలో కరోనా జాగ్రత్తలు చెప్పారు.
శ్వాసకు సంబంధించిన వ్యాయామం చేయడంతో పాటు ఆవిరి పెట్టుకోవడం ద్వారా కరోనా నుంచి బయటపడవచ్చని తెలిపారు. ఇక తగినంత నిద్ర పోవడంతో పాటు టైమ్‌కు ఆహారం తీసుకోవడం ద్వారా కూడా కరోనా రాకుండా నివారించుకోవచ్చని రాజమౌళి చెప్పాడు. ఇక ఆర్ ఆర్ ఆర్ సినిమా ఎప్పుడు వస్తుందో ? తనకు కూడా క్లారిటీ లేదని చెప్పాడు. ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసిన పది రోజుల్లో తారక్ విజువల్స్ వస్తాయని చెప్పారు. ఇక ఆర్ ఆర్ ఆర్ కంప్లీట్ చేసిన వెంటనే రాజమౌళి మహేష్ బాబు ప్రాజెక్టుపై వర్క్ చేయనున్నారు. ఈ సినిమాను కేఎల్. నారాయణ నిర్మించనున్నారు.