బ్రేకింగ్‌: జ‌గ‌న్‌కు నువ్వు చేసేది క‌రెక్ట్ కాదు… సొంత పార్టీ ఎంపీ ఫైర్‌

వైఎస్సార్‌సీపీ అధినేత‌, ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిపై సొంత పార్టీకే చెందిన న‌ర‌సాపురం ఎంపీ ర‌ఘురామ కృష్ణంరాజు మ‌రోసారి ఫైర్ అయ్యారు. శుక్ర‌వారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయ‌న జ‌గ‌న్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకు ప‌డ్డారు. రాష్ట్రానికి ఒకే రాజ‌ధాని ఉండాల‌ని.. ఏపీ రాజ‌ధానిగా అమ‌రావ‌తి మాత్ర‌మే ఉండాల‌ని ఆయ‌న ఆకాంక్షించారు. అమ‌రావ‌తి ప్ర‌జ‌లు రాజ‌ధానిగా అమ‌రావ‌తి ఉంటుంద‌ని న‌మ్మే వేల ఎక‌రాల భూములు ఇచ్చార‌ని.. ఇప్పుడు వారికి రు. 80 వేల కోట్లు ఎలా ఇస్తార‌ని కూడా ప్ర‌శ్నించారు.

 

ప్ర‌భుత్వాలు మారిన‌ప్పుడ‌ల్లా రాజ‌ధానిని మార్చుకుంటూ పోవ‌డం స‌రికాద‌ని ఆయ‌న కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు. ఇక ఈ ప్ర‌భుత్వ పాల‌న‌లో అమ‌రావ‌తి రైతుల‌కు న్యాయం చేసే ప‌రిస్థితి లేద‌ని ఆరోపించారు. అలాగే న్యాయ వ్య‌వ‌స్థ‌పై నాకు న‌మ్మ‌కం ఉంది.. న్యాయ వ్య‌వ‌స్థ‌పై కుయుక్తులు యంచిది కాద‌ని ప‌రోక్షంగా జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి చుర‌కలు వేశారు. జిల్లాకో రాజ‌ధాని అన్న‌ట్టుగా 13 రాజ‌ధానులు ఉంటే ప్ర‌జ‌లు షాక్‌కు గుర‌వుతారని ర‌ఘురామ ఎద్దేవా చేశారు.

 

ఇక ప్ర‌స్తుతం ఫెన్ష‌న్లు పెంచ‌లేక‌పోతున్నాం.. జీతాలు ఇవ్వ‌లేక‌పోతున్నాం అన్న ఆవేద‌న కూడా ఉంద‌న్నారు. ఇక త‌న విష‌యంలో మాజీ ఎమ్మెల్సీ, ప్ర‌ముఖ విశ్లేష‌కులు డాక్ట‌ర్ నాగేశ్వ‌ర్ చేసిన వ్యాఖ్య‌ల‌పై కూడా ఆయ‌న‌కు బెదిరింపు కాల్స్ వెళుతున్నాయ‌ని.. ఆయ‌న ఫిర్యాదు చేసిన విష‌యం త‌న‌కు తెలిసింద‌ని.. ఇలాంటి బెదిరింపులు స‌రికాద‌ని కూడా ఆయ‌న ఖండించారు.

Leave a comment