రాంగోపాల్ వర్మ రక్తచరిత్ర సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయిన రాధికాఆఫ్టే ఆ తర్వాత బాలయ్యతో లెజెండ్, లయన్ రెండు సినిమాల్లో నటించింది. ముందు నుంచి ఏ విషయంలో అయినా ఉన్నది ఉన్నట్టు బోల్డ్‌గా మాట్లాడేసే రాధిక తన వ్యాఖ్యలతో కొన్ని కాంట్రవర్సీలు కూడా క్రియేట్ చేసింది. ఇక తెలుగు, బాలీవుడ్లో తనకు వచ్చిన ఛాన్స్‌లను వాడుకుంట కెరీర్ నెట్టుకొస్తోన్న ఆమె బోల్డ్ క్యారెక్టర్లతో బాగా పాపులర్ అయ్యింది. ఇటీవల బద్లాపూర్, పార్చ్డ్ సినిమాల్లో శృంగార సన్నివేశాల్లో నటించిన ఆమె అర్ధ నగ్న సీన్లలో ఏ మాత్రం బెరుకు లేకుండానే తన అందాలు ఆరబోస్తోంది.
ఇక శృంగారం విషయంలో ఉన్నది ఉన్నట్టు బోల్డ్‌గా మాట్లాడేసే రాధిక ఈ బోల్డ్ కంటెంట్ మూవీలు చూసి కొందరు నిర్మాతలు తన దగ్గరకు వచ్చే శృంగార సన్నివేశాలు ఉన్న సినిమాలే చేయాలని కోరుతున్నారని చెప్పింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రాధిక ఈ విషయాన్ని ప్రస్తావించింది. తాను కథ డిమాండ్ చేస్తే న్యూడ్‌గా నటించేందుకు రెడీగానే ఉన్నానని.. అయితే కావాలనే శృంగార సన్నివేశాలతో కూడిన సినిమాలు మాత్రం చేయనని చెపుతోంది.
కొందరు నిర్మాతలు కేవలం కథలో దమ్ములేకుండా నాలుగైదు శృంగార సీన్లు చెప్పి అందులో నటించాలని అడుతున్నారని… అలాంటి వారికి తాను నో చెప్పానంటోంది రాధిక. ఇక న్యూడ్ సీన్లలో ఫీల్ ఉంటే చేస్తానన్న ఆమె తనకు మంచి రొమాంటిక్ లవ్‌స్టోరీల్లో నటించాలని ఉందని చెపుతోంది. న్యూడ్ సీన్లలో నటించడంతో రాధికను ఇప్పుడు అందరూ ఆ టైప్ సీన్లలో మాత్రమే నటించే హీరోయిన్గా తనను చూస్తున్నారని ఆమె వాపోతుంది.