భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతి చెందారు. కాంగ్రెస్ పార్టీలో సుధీర్ఘకాలంగా రాజకీయాలు చేసిన ఆయన కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. ఆ తర్వాత ఆయన భారత రాష్ట్రపతిగా పనిచేశారు. గాంధీ కుటుంబానికి ఆయన అత్యంత విశ్వాసపాత్రులుగా ఉన్నారు. ఇక కొద్ది రోజులుగా తీవ్ర ఆరోగ్య సమస్యలతో బాధపడుతోన్న ఆయన ఈ రోజు మృతి చెందారు. ఆయన్ను కాపాడేందుకు ఆర్మీ ఆసుపత్రి వైద్యులు తీవ్రంగా శ్రమించినా ఆయనకు ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌తో పాటు కోవిడ్ – 19 సోకడంతో ఆయన పరిస్థితి రోజు రోజుకు విషమించింది.
ఈ నెల 10న ఆయన ఆసుపత్రిలో చేరారు. అంతకుమందు ఆయనకు మెదడలు రక్తం గడ్డ కట్టడంతో ఆపరేషన్ చేశారు. ఇక ఆయన సెప్టిక్ కోమాలోకి వెళ్లిపోవడంతో వైద్యులు ఎంత ప్రయత్నిచినా ఆయన్ను కాపాడలేకపోయారు. చివరకు ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. 1935 డిసెంబర్ 11న ఆయన జన్మించారు. ఆయన్ను ముద్దుగా దాదా అని పిలుస్తుంటారు.