తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా ఉంది. ఈ విషయాన్ని ఢిల్లీ ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరల్ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఆయనకు ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్ ఆయన ఆరోగ్యాన్ని మరింత దీనస్థితికి తీసుకువెళ్లిందని వీరు చెపుతున్నారు. వీరు విడుదల చేసిన ప్రకటనలో ప్రణబ్ ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్ కారణంగా ఆయన సెప్టిక్ షాక్‌లోకి వెళ్లారని వైద్యులు చెపుతున్నారు.
ప్రస్తుతం ప్రణబ్ డీప్ కోమాలో ఉన్నారు. వెంటిలేటర్ పైనే ఆయనకు చికిత్స అందిస్తున్నాం అని తెలిపారు. ముందుగా వైద్యులు ప్రణబ్ మెదడకు ఆపరేషన్ చేసిన అందులో ఏర్పడిన అడ్డంకులను తొలగించారు. ఈ లోగా ఆయనకు కోవిడ్ -19 ఎటాక్ అయ్యింది. దీంతో ఆరోగ్యం విషమించి కోమాలోకి వెళ్లిపోయారు. ఇక సెప్టిక్ షాక్‌కు గురయ్యే వ్యక్తుల్లో మెదడు, గుండె, కీడ్నీలు సరిగా పనిచేయకపోవడంతో పాటు బీపీ తీవ్రంగా పడిపోతుంది.
ఇక ఈ సెప్టిక్ షాక్ వల్ల మూత్ర సమస్యలతో పాటు ప్రాణాలు కూడా పోయే ప్రమాదకర పరిస్థితులు ఉంటాయి. ఇక ప్రణబ్ ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు స్పందిస్తోన్న ఆయన కుమారుడు అభిజిత్ ముఖర్జీ ప్రతి ఒక్కరూ తన తండ్రి కోసం ప్రార్థించాల్సిందిగా కోరారు. ప్రస్తుతానికి ఆయన పారామీటర్స్ అన్ని స్థిరంగానే ఉన్నాయని అభిజిత్ చెప్పాడు.