ఇటీవల కాలంలో పెళ్లికి ముందే డేటింగ్లు, భౌతిక కలయికలు చాలా కామన్. ఇక స్టార్ హీరోల నుంచి హీరోయిన్ల వరకు అందరూ పెళ్లికి ముందే డేటింగ్లో మునిగి తేలుతున్నారు. ఇంకా చెప్పాలంటే కొందరు ఒకరితో డేటింగ్ చేసి విడిపోయాక మళ్లీ కొత్త డేటింగ్లు ప్రారంభించేస్తున్నారు. ఇక సినిమా స్టార్లలో ఎవరు పెళ్లికి ముందే తల్లులు అయ్యారో ఓ లుక్కేద్దాం. పవన్ కళ్యాణ్ రెండో భార్య, హీరోయిన్ అయిన రేణుదేశాయ్ పవన్‌ను పెళ్లి చేసుకోకుండానే తల్లి అయ్యింది. ఆ తర్వాత పవన్ ఆమెను పెళ్లి చేసుకున్నాడు.
ఇక అందాల తార శ్రీదేవిని పెళ్లాడేందుకు ఎంతోమంది లైన్లో ఉన్నా ఆమె బోనీకపూర్‌ను రెండో పెళ్లి చేసుకుంది. సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ నుంచి మొదలు పెడితే అప్పట్లో ఎంతోమంది హీరోలు ఆమెను చేసేందుకు రెడీగా ఉండేవారు. హీరో రాజశేఖర్‌కు కూడా శ్రీదేవిని చేసుకోవాలని ఆఫర్ శ్రీదేవి తల్లి ద్వారా వచ్చింది. ఇక ఆమె బోనీకపూర్‌ను పెళ్లి చేసుకోవడానికి ముందే ప్రెగ్నెంట్.
ఇక కమల్‌హాసన్ మాజీ భార్య సారిక కూడా పెళ్లి కాకుండానే శృతీహాసన్‌కు జన్మనిచ్చింది. కమల్‌కు అంతకు ముందే వాణీ గణపతితో పెళ్లయ్యింది. ఆమెకు విడాకులు ఇచ్చి సారికను రెండో పెళ్లి చేసుకున్నాడు. వీరికి శృతి, అక్షర పుట్టాక ఆమెకు దూరమయ్యాడు. ఆ తర్వాత గౌతమితో సహజీవనం చేసి మళ్లీ ఆమెకు కూడా దూరమయ్యాడు.