ప్రిన్స్ మహేస్‌బాబు ప్రస్తుతం పరశురాం దర్శకత్వంలో తన 27వ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే టైటిల్ ఎనౌన్స్ మెంట్ జరగడంతో పాటు ఇది పక్కా పొలిటికల్, మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ అన్న టాక్ రావడంతో భారీ అంచనాలు ఉన్నాయి. సబ్జెక్టుపై మంచి కమాండింగ్‌తో పరశురాం సినిమాలు తెరకెక్కిస్తూ ఉంటాడు. తొలిసారి ఓ స్టార్ హీరో ఛాన్స్ ఇవ్వడంతో ఎట్టి పరిస్థితుల్లోనూ దీనిని యూజ్ చేసుకుని బ్లాక్‌బస్టర్ కొట్టి తానేంటో ఫ్రూవ్ చేసుకునేందుకు పరశురాం తీవ్రంగా శ్రమిస్తున్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
ఇక కరోనా నేపథ్యంలో షూటింగ్ వాయిదా పడినా సెట్స్ మీదకు వెళ్లకుండానే అన్ని విషయాల్లోనూ పక్కా క్లారిటీతో ఉండాలని మహేష్ పరశురాంను ఆదేశించాడట. ముఖ్యంగా సాంగ్స్‌తో పాటు, నేపథ్య సంగీతం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా సూచించినట్టు సమాచారం. ఇందుకు ప్రధాన కారణం సరిలేరు నీకెవ్వరు సినిమా సంక్రాంతికి అల సినిమాతో పోటీగా వచ్చింది. సరిలేరు ఆడియోకు ఏ మాత్రం మంచి టాక్ రాలేదు. ఇక ఆర్ ఆర్ కూడా అంతంత మాత్రంగానే ఉంది.
సరిలేరుకు మ్యూజిక్ పరంగా మైనస్ మార్కులు పడ్డాయి. అందుకే ఈ విషయంలో మహేష్ చాలా కేర్ తీసుకుంటున్నాడు. సినిమా సెట్స్ మీదకు వెళ్లే ముందుగానే ఆల్బమ్ పక్కాగా రెడీ అవ్వాలని.. సినిమా షూటింగ్ ఎండింగ్‌కు వచ్చే సరికి ఒక్కో సాంగ్ రిలీజ్ చేసుకుంటూ వెళ్లాలని మహేష్ ప్లానింగ్‌తో ఉన్నాడట. అల టీం ఆ సినిమా రిలీజ్‌కు ముందు ఇలాంటి స్ట్రాటజీతోనే ముందుకు వెళ్లి సూపర్ సక్సెస్ అయ్యింది. ఇక ఇప్పుడు మహేష్ ఈ విషయంలో సీరియస్‌గా ఆదేశాలు ఇవ్వడంతో థమన్ – పరశురాం సర్కారు ఆల్బమ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు ఇండస్ట్రీ టాక్..?