విజయవాడకు చెందిన రంభ దక్షిణ సినీపరిశ్రమను 1990 – 2000 మధ్య పదేళ్లలో ఓ ఊపు ఊపేసింది. తెలుగు, తమిళ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ కొందరు స్టార్లతో ఆమె సినిమాలు చేసింది. ఇక భోజ్‌పురిలోకి వెళ్లాక అక్కడ ప్రజలు ఆమెను ఓ ఆరాధ్య దేవతలా చూడడంతో రంభకు అక్కడ తిరుగులేకుండా పోయింది. బాలీవుడ్‌లోనూ రంభ 15 సినిమాల వరకు చేసింది. కెనడాకు చెందిన ఎన్నారై ఇంద్రకుమార్‌ను పెళ్లి చేసుకుని ముగ్గురు పిల్లలకు తల్లి అయిన రంభ మళ్లీ సినిమాల వైపు చూడలేదు.
ఇక రంభ పిల్లలు పెద్దోళ్లు అవ్వడంతో ఆమె మళ్లీ సినిమాల వైపు చూస్తున్నట్టు తెలుస్తోంది. ఫేస్ బుక్ లో రంభ రెగ్యులర్ గా పోస్ట్ చేస్తున్న ఫొటోలు చూస్తుంటే ఇంకా ఈమె హీరోలకు అమ్మగా కాకుండా హీరోయిన్ గానే చేస్తే బాగుంటుందన్న చర్చలు నడుస్తున్నాయి. ఆ ఫొటోలో రంభ అంత క్యూట్‌గా, స్లిమ్‌గా ఉంది. అసలు ఆ ఫొటో చూస్తుంటే రంభ ముగ్గురు పిల్లల తల్లేనా అన్న డౌట్ కూడా వస్తోంది. నేటి తరం హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోకుండా రంభ ఆంటీ ఫొటోలో కనిపిస్తోంది.
చాలా మంది ఆ ఫొటో కింద మళ్లీ మీరు హీరోయిన్‌గా నటించండి.. మీరు హీరోయిన్‌గా చేసినా చూడాలనుకునే మీ అభిమానులం చాలా మంది ఉన్నాం అని కామెంట్లు పెడుతున్నారు. ఏదేమైనా రంభ మళ్లీ వెండితెరపై కనిపిస్తే చూసేందుకు చాలా మంది ఉత్సాహం చూపిస్తున్నారు.