యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఆర్ ఆర్ ఆర్ ( రౌద్రం రణం రుధిరం ) సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్‌తో తెరకెక్కే ఈ సినిమాలో రామ్‌చరణ్ కొమరం భీం పాత్రలో నటిస్తున్నారు. కరోనా ఎఫెక్ట్ లేకుండా ఉంటే ఈపాటికే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యేది. ఎన్టీఆర్ – త్రివిక్రమ్ సినిమా కూడా ప్రారంభమై ఉండేది. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ – త్రివిక్రమ్ సినిమా టైటిల్ మారే అవకాశాలు ఉన్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఈ సినిమాకు ముందుగా ‘అయినను పోయి రావలె హస్తినకు’ అనే టైటిల్ అనుకుంటున్నట్లు వార్తలు వినిపించాయి. అయితే త్రివిక్రమ్ తన సెంటిమెంట్ ప్రకారమే ఇప్పుడు టైటిల్ మార్చాలనుకుంటున్నాడట. త్రివిక్రమ్ సినిమాకు అ అక్షరం సెంటిమెంట్ ఉంది. ఇప్పుడు ఈ సినిమాకు కూడా అదే అక్షరం ప్రకారం టైటిల్ వచ్చేలా చూస్తున్నాడట. ఈ వార్తలే నిజమైతే ఎప్పటిలా తన సెంటిమెంట్‌ను ఫాలో అవుతూ ఈ సినిమాకు అ అక్షరంతో మొదలయ్యే టైటిల్ పెడతారు.
ఇక గతంలో త్రివిక్రమ్ – ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన అరవింద సమేత వీరరాఘవ త్రివిక్రమ్ మార్క్‌కు భిన్నంగా తెరకెక్కింది. ఇప్పుడు ఈ సినిమాను మాత్రం తనస్టైల్లో పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కే ప్లాన్ చేస్తున్నారట.