Gossipsఆర్ ఆర్ ఆర్‌లో ఆరు పాత్ర‌ల్లో ఎన్టీఆర్‌.. సూప‌ర్ ట్విస్ట్ వెన‌క‌...

ఆర్ ఆర్ ఆర్‌లో ఆరు పాత్ర‌ల్లో ఎన్టీఆర్‌.. సూప‌ర్ ట్విస్ట్ వెన‌క‌ స్టోరీ ఇదే…!

టాలీవుడ్ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఆర్ ఆర్ ఆర్ సినిమాలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్…. తెలంగాణ పోర‌టా వీరుడు కొమురం భీమ్ పాత్ర‌లో … మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ విప్ల‌వ వీరుడు అల్లూరి సీతారామ రాజుగా న‌టిస్తోన్న ఈ భారీ బ‌డ్జెట్ సినిమాను డీవీవీ దాన‌య్య ఏకంగా రు. 300 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే 70 శాతం షూటింగ్ కంప్లీట్ అయిన ఈ సినిమాను వ‌చ్చే సంక్రాంతికి రిలీజ్ చేయాల‌ని అనుకున్నా క‌రోనా నేప‌థ్యంలో షూటింగ్ వాయిదా ప‌డ‌డంతో ఎప్పుడు రిలీజ్ అవుతుందా ? అని కోట్లాది మంది సినీ అభిమానులు వెయిట్ చేస్తున్నారు.

 

ఇక రౌద్రం ర‌ణం రుధిరం(ఆర్ఆర్ఆర్‌) టైటిల్‌తో వ‌స్తోన్న ఈ సినిమాలో తార‌క్ క్యారెక్ట‌ర్ గురించి అదిరిపోయే అప్‌డేట్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఆర్ఆర్ఆర్ లో తార‌క్ ఆరు గెట‌ప్పులో క‌న‌ప‌డ‌నున్నార‌ట‌. అదేంటి తార‌క్ ఏంటి కొమ‌రం భీం పాత్ర‌లో న‌టించే వ్య‌క్తి ఆరు గెట‌ప్పులు వేయ‌డం ఏంట‌ని షాక్ అవుతున్నారా ? బ్రిటీష్ వారిని క‌న్నుగ‌ప్పే ప్ర‌య‌త్నంలో తార‌క్ ఆరు గెట‌ప్పులు వేసుకుంటార‌ని అంటున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ తార‌లు అజ‌య్ దేవ‌గ‌ణ్‌, ఆలియా భ‌ట్ త‌దిత‌రులతో పాటు రే స్టీవెన్ స‌న్‌, అలిస‌న్ డూడీ వంటి హాలీవుడ్ స్టార్స్ న‌టిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news