సిద్దార్ధ, జెనీలియా జంటగా నటించిన సినిమా 2006లో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. అప్పట్లో యూత్‌తో పాటు ఫ్యామిలీని బాగా ఆకట్టుకుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాను డైరెక్ట్ చేసిన భాస్కర్ బొమ్మరిల్లు భాస్కర్‌గా మారిపోయాడు. అయితే ఈ సినిమా ముందు ఎన్టీఆర్ చేయాల్సిందట. దిల్ రాజు బొమ్మరిల్లు కథను ముందుగా ఎన్టీఆర్‌కు వినిపించాలని దర్శకుడు భాస్కర్‌కు సూచించాడట.
కథ విన్న ఎన్టీఆర్ ఈ సినిమా కథ బాగా నచ్చిందని.. అయితే కొన్ని కారణాలతో ఈ సినిమాను తాను రిజెక్ట్ చేశానని ఎన్టీఆర్ తాజాగా తెలియచేశారు. స్క్రిఫ్ట్ బాగా నచ్చినా కూడా అప్పట్లో తనకున్న ఇమేజ్ కారణంగా ఆ సినిమా చేయలేకపోయానని ఎన్టీఆర్ చెప్పాడు. అప్పట్లో ఎన్టీఆర్ వరుస పెట్టి మాస్ సినిమాలు చేస్తూ వచ్చాడు.
ఎన్టీఆర్ సినిమా వస్తుందంటేనే ఆయన అభిమానులు డ్యాన్సులు, ఫైట్లు, డైలాగులు ఆశించేవారు… సింహాద్రి నుంచి ఎన్టీఆర్‌కు ఈ ఇమేజ్ బాగా పెరిగింది. అందుకే ఈ క్లాస్ కథతో సినిమా చేస్తే ఎలా రిసీవ్ చేసుకుంటారనే ఎన్టీఆర్ ధైర్యం చేయలేకపోయాడు. అలా ఎన్టీఆర్ కెరీర్లో ఓ బ్లాక్ బస్టర్ మిస్ చేసుకున్నాడు.