ఆర్ ఆర్ ఆర్ సినిమాను ఓ శిల్పంలా చెక్కుతున్నాడు దర్శకధీరుడు రాజమౌళి. ఇక మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ పుట్టిన రోజు సందర్భంగా మెగా అభిమానులను ఉర్రూతలూగించేశాడు రాజమౌళి. ఎన్టీఆర్ వాయిస్ ఓవర్‌తో రామ్‌చరణ్ స్క్రీన్ ప్రెజన్స్‌తో అదిరిపోయే గూస్‌బంప్స్ ఇచ్చేశాడు. అప్పటి నుంచి ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ లేదా వీడియో ఎప్పుడు వస్తుందా ? అని ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆశతో ఉన్నారు. మధ్యలో ఎన్టీఆర్ పుట్టిన రోజు వచ్చింది… వెళ్లింది.. ఇంకా ఎన్టీఆర్ లుక్ రాలేదు.
ఓ వైపు అల్లూరి సీతారామారాజు రోల్ ఎలా ఉంటుందో ? క్లారిటీ వచ్చింది. ఇక ఎన్టీఆర్ రోల్ అయిన కొమరం భీం రోల్ ఎలా ఉంటుందన్నది మాత్రం ఇప్పటకీ క్లారిటీ లేదు. చరణ్ వీడియో వచ్చి నెలలు గుడుస్తున్నా ఎన్టీఆర్ టీజర్ వీడియో, స్టిల్స్ రాలేదు. తారక్ టీజర్ కోసం అభిమానుల నిరీక్షణ కొనసాగుతూనే ఉంది. ఈ టైంలో తారక్ అభిమానుల నిరీక్షణకు తెరదించిన రాజమౌళి కరోనా తగ్గాక ఓ 10 రోజులు షూటింగ్ జరిగాక కాని తారక్ విజువల్స్ బయటకు వచ్చే అవకాశం లేదని చెప్పాడు.
కరోనా తగ్గాక షూటింగ్ స్టార్ట్ అయ్యాక కూడా తారక్ టీజర్ కంటెంట్ కోసమే ఓ 15 రోజులు స్పెండ్ చేయాలని.. ఆ తర్వాత షూటింగ్ ప్రారంభించాక మరి కొద్ది రోజులు టైం తీసుకున్నాకే టీజర్ రెడీ అవుతుందని రాజమౌళి చెప్పాడు. దీనిని బట్టి చూస్తే షూటింగ్ మొదలు పెడితే వచ్చే నెలాఖరకు కాని ఎన్టీఆర్ టీజర్ వచ్చే అవకాశాలు లేవు. ఏదేమైనా రాజమౌళి లేట్‌పై ఎన్టీఆర్ అభిమానులు అసహనంగా ఉన్నా అంతకుమించి ఎవ్వరూ చేసేదేం లేదు.