దర్శకధీరుడు రాజమౌళి ప్రెస్టేజియస్ ప్రాజెక్టు ఆర్ ఆర్ ఆర్ వచ్చే సంక్రాంతికి రావడం అసాధ్యం అన్నది తేలిపోయింది. కరోనా నుంచి కోలుకున్న రాజమౌళి సైతం కరోనా ఎప్పుడు తగ్గుతుందో ? మళ్లీ షూటింగ్ ఎప్పుడు ప్రారంభం అవుతుందో కూడా తెలియని పరిస్థితి ఉందని రాజమౌళి స్వయంగా చెప్పారు. ఇక ఆర్ ఆర్ ఆర్ ప్రకటించినప్పటి నుంచే ఎన్టీఆర్, రామ్‌చరణ్ అభిమానులే కాకుండా యావత్ దేశవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు అందరూ ఎంతో ఆసక్తితో వెయిట్ చేస్తున్నారు.
ఇక ముందుగా ఆర్ ఆర్ ఆర్‌ను 2020 జూలై 30 రిలీజ్ చేయాలనుకున్నారు. ఆ తర్వాత 2021 జనవరి 8కి ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ అని మొన్నామధ్య ఎనౌన్స్ చేశారు. ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎప్పుడూ ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది. ముందు రామ్‌చరణ్ గాయపడడం, ఆ తర్వాత ఎన్టీఆర్‌కు గాయపడడం జరిగింది. అప్పుడే షూటింగ్ వాయిదాలు పడింది. ఇక ఇప్పుడు కరోనా రావడం.. రాజమౌళి సైతం కరోనా భారీన పడి ఇప్పుడే కోలుకున్న సంగతి తెలిసిందే. అసలు ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలియట్లేదు.
ఇక 2021లో ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ ప్రారంభమైతే షూటింగ్ కంప్లీట్ చేసి… ఎడిటింగ్ చేసి 2022కే రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట. అంతకు మించి ఆర్ ఆర్ ఆర్‌కు మార్గం లేదని రాజమౌళి టీం ఉందట. ఇక ఆర్ ఆర్ ఆర్ వచ్చే సంక్రాంతితో పాటు వచ్చే యేడాది లేకపోవడంతో స్టార్స్ సినిమాలు వరుసగా లైన్లోకి రానున్నాయి.