సౌత్ ఇండియన్ ప్రేమ జంట లేడీ సూపర్‌స్టార్ నయనతార, విఘ్నేశ్ శివన్ ఈ రోజు కొచ్చికి వెళ్లారు. కేరళలో జరుపుకునే అతి ముఖ్యమైన పండగల్లో ఒకటి అయిన ఓనం పండగను జరుపుకునేందుకు వీరు ఓ ప్రైవేట్ జెట్ విమానంలో కొచ్చికి వెళ్లారు. లాక్డౌన్ ప్రారంభమైనప్పటి నుంచి గత ఎనిమిది నెలలుగా వీరిద్దరు చెన్నైలోనే కలిసి ఉంటున్నారు. ఇక కుటుంబ సభ్యుల మధ్య ఓనం పండగ జరుపుకునేందుకు నయన్ తన ప్రియుడితో కలిసి కొచ్చికి వచ్చారు.
ఈ క్రమంలోనే వీరు ఫ్లైట్ దిగుతోన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఏ మాత్రం చిన్న గ్యాప్ దొరికినా ఈ ప్రేమ జంట టూర్లకు వెళుతూ ఉంటుంది. ఇక త్వరలోనే వీరు పెళ్లికి రెడీ అవుతోన్న నేపథ్యంలో వీరి వైవాహిక జీవితం ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉండేందుకు వీరు గుళ్లు, గోపురాలకు వెళుతూ పూజలు చేస్తున్నారు.
నయనతార తాజాగా నటిస్తున్న మిస్టరీ థ్రిల్లర్ చిత్రం నేత్రికన్ ను విఘ్నేశ్ శివన్ స్వయంగా నిర్మిస్తున్నారు. అలాగే ఆమె నటిస్తోన్న కాతు వాకుల రెండు కధల్ అనే చిత్రానికి విఘ్నేశ్ దర్శకత్వం వహిస్తున్నారు.